నిర్భయ నిందితులు చివరిరోజు ఏం చేశారో తెలుసా?

Update: 2020-03-20 04:08 GMT
నిర్భయను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపిన నలుగురు దోషులు అక్షయ్ ఠాగూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముకేష్ సింగల్ లను ఇవాళ ఉదయం తీహార్ జైల్లో ఉరితీశారు. వీరికి గతంలో మూడు సార్లు డెత్ వారెంట్లు రద్దయ్యాయి. ఈసారి కూడా చివరి నిమిషం వరకూ ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఏర్పడింది.

గురువారం రాత్రి ఢిల్లీ హైకోర్టు ఈ దోషులకు ఉరికి నిలిపేసేందుకు నిరాకరించడంతో దోషుల తరుఫున న్యాయవాది ఏపీ సింగ్ .. అర్థరాత్రి దాటాక సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ ను ఆశ్రయించారు. అక్కడ కూడా నిర్భయ దోషులకు ఊరట దక్కలేదు. గంట సేపే వాదనలు అనంతరం సరైన కారణం లేనందున ఉరిశిక్ష అమలును నిలుపుదల చేయలేమని శుక్రవారం వేకువ జామున 2.30 గంటలకు సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

సుప్రీం కోర్టులోనూ తమకు ఊరట లభించలేదని తెలుసుకున్న నిర్భయ నిందితులకు గురువారం రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపారు. రాత్రి చాలా సేపటి వరకు నలుగురు దోషులు వారి సెల్ లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించినట్లు జైలు అధికారులు తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం నాలుగు వేర్వేరు సెల్స్ లో ఉంటున్న నిందితులను వేకువ జామున 3.30 గంటలకు తీహార్ జైలు అధికారులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్నారు.

అనంతరం ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష అమలు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. సరిగ్గా ఉదయం 5.30గంటలకు ఉరితీశారు. అరగంట సేపు ఉరికొయ్యలకే వారి మృతదేహాలను వేలాడదీశారు. పోస్టుమార్టం అనంతరం ఈ మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
Tags:    

Similar News