తాంత్రికుల సలహా వల్లే.. టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్‌గా మార్చారు: నిర్మలమ్మ సటైర్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణ ప్రభుత్వంపైనా.. సీఎం కేసీఆర్‌పైనా.. సటైర్లు వేశారు. ఇటీవల టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్‌గా మారుస్తూ.. పార్టీని జాతీయ పార్టీగా ప్రొజెక్టు చేయాలని నిర్ణయిం చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పేరు మార్పు నిర్ణయం తీసుకుని అమలు చేశారు. అయితే.. దీనిపై నిర్మలమ్మ సటైర్లు వేశారు. తాంత్రికుల సలహావల్లే.. ఆయన టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్‌గా మార్పు చేశారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సెంటుమెంటును అడ్డం పెట్టుకుని టీఆర్ ఎస్(తెలంగాణ రాష్ట్రసమితి)ని ఏర్పాటు చేశారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం.. ప్రయత్నించారన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత.. కు పట్టం కడతామని.. అప్పట్లో కేసీఆర్ చెప్పారన్నారు. అయితే.. 2014-2018 వరకు అంటే.. నాలుగేళ్లపాటు.. ఒక్క మహిళకు కూడా టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు.
అంతేకాదు.. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. కూడా..ఏడాదిపాటు ఒక్క మహిళను కూడా.. ప్రబుత్వంలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు. ఇది కూడా..తాంత్రికుల సలహా మేరకే చేశారని విమర్శలు గుప్పించారు. 2014లో ఏర్పడిన తెలంగాణ.. మిగులు బడ్జెట్‌తో అవతరించిందని.. చెప్పారు. అయితే.. ఇప్పుడు అప్పులు చేసుకునే రాష్ట్రాల జాబితాలో చేరిపోయిందన్నారు. 3 లక్షల కోట్ల అప్పులు చేశారని.. జీఎస్‌డీపీలో ఇది 25 శాతానికి చేరిందన్నారు.
నీటి విషయంపై మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో పూర్తి చేయాల్సి ఉందని, అయితే అది రూ.1,40,000 కోట్లకు చేరుకుందని, దానికి కారణాలపై సరైన వివరణ ఇవ్వకపోగా, ఉద్యోగాల మూడో వాగ్దానాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా.. ప్రజలకు ద్రోహం చేసిందన్నిరు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అనే మూడు అంశాల్లోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీతారామన్ అన్నారు.
తంత్రగాళ్లు, సంఖ్యా జ్యోతిష్యం చెప్పేవాళ్లు .. కేసీఆర్‌కు అత్యంత ముఖ్యులని సీతారామన్ ఎద్దేవా చేశారు. వారు ఇచ్చిన సలహా మేరకే సచివాలయానికి కూడా ఆయన వెళ్లడం మానుకున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్చారని అన్నారు.