తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లలో నిర్మలా సీతారామన్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఆమె ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ సతీమణి అన్న సంగతి తెలిసిందే. తెలుగింటి కోడలుగా ఆమెను ఆంధ్రోళ్లు ఆమెను అక్కున చేర్చుకున్నా.. ఏపీకి ఏమీ చేయలేదన్న విమర్శను ఆమె ఎదుర్కొంటున్నారు.
కీలకమైన సమయంలో రక్షణ మంత్రి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆమె.. పాక్ పై దాదాపు యుద్ధ వాతావరణం కమ్ముకున్న వేళ ఆమె రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ఆమె పొలిటికల్ కెరీర్ కు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఆమె.. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక ఎంపీగా బరిలోకి నిలుస్తారని చెబుతున్నారు. బీజేపీకి ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉండటం.. తమిళనాడులో బీజేపీకి అంత సీన్ లేని నేపథ్యంలో..కర్ణాటకలో అయితే ఆమెకు సేఫ్ అవుతుందన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కేంద్ర మంత్రి అనంతకుమార్ ఇటీవల కేన్సర్ తో మరణించటం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు సౌత్ లో సీటు భర్తీ చేయటానికి నిర్మలమ్మ సరైన అభ్యర్థిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకూ అనంతకుమార్ స్థానంలో ఆయన సతీమణిని పోటీలోకి దించుతారన్న అభిప్రాయం ఉన్నా.. తాజాగా మారిన సమీకరణాల్లో ఆ స్థానం నుంచి నిర్మలమ్మను దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీకి కంచుకోట లాంటి బెంగళూరు సౌత్ నుంచినిర్మలమ్మ బరిలోకి దిగితే ఆమె విజయానికి తిరుగు ఉండదన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రానప్పటికీ స్థానికంగా మాత్రం.. నిర్మలమ్మ చూపు బెంగళూరు దక్షిణం మీద పడినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది కాలమే డిసైడ్ చేయాలి.