ఈ సమాజంలో రోజురోజుకి అమ్మాయిలపై జరిగే అఘేత్యాల సంఖ్య ఎక్కువైపోతోంది. ఎక్కడ చూసిన అమ్మాయి పై అఘాయిత్యం - పెళ్ళికి ఒప్పుకోలేదు అని యాసిడ్ దాడి చేయడం ఇవే ఘటనలు. మారుతున్న కాలంలో కొద్దీ అభివృద్ధి చెందిన టెక్నాలజీ మంచి కి ఉపయోగపడాలి కానీ - సమాజం నాశనం కావడానికి కాదు. ఇదే టెక్నాలజీ ని ఉపయోగించుకొని కొంతమంది ప్రయోజకులు అవుతున్నా కూడా ..చాలామంది కిరాతకులుగా తయారౌతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు - అమ్మాయిలపై దారుణాలకు పాల్పడటానికి పొర్న్ వెబ్ సైట్లే కారణం అని వాటిని అరికట్టడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పొర్న్ వెబ్ సైట్లు పూర్తిగా నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని - పొర్న్ వెబ్ సైట్లు నిషేదించాలని కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తున్నానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. హైదారాబాద్ వెటర్నటీ డాక్టర్ దిశ హత్యాచారం చేసిన కిరాతకుల ఎన్ కౌంటర్ పై స్పందించిన అయన ..ఈ విధంగా మాట్లాడారు. అలాగే దిశ ఉదంతం పై మాట్లాడుతూ .. దిశ ఘటన జరగడం చాలా దారుణమని - అమ్మాయి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తంటే చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. దిశ ఘటనలో పోలీసులు వారి పని వారు చేసుకుని వెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చెయ్యడం వలనే దేశంలో మహిళలు - చిన్నారుల మీద లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయని - వాటిని అరికట్టాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు.
దేశంలో మహిళలు - చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్లు వాటిని చిత్రీకరించి సోషల్ మీడియోలో ఆ వీడియోలు పోస్టు చేస్తున్నారని - ఆ వీడియోలు చూసి ఇతరులు ఇలాంటి లైంగిక దాడి నేరాలకు పాల్పడుతున్నారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యంగా మన దేశంలో పొర్న్ వెబ్ సైట్లపై పూర్తిగా నిషేదం విధించాలని - వెబ్ సైట్లలో ఇలాంటి పొర్న్ వీడియోలు పూర్తిగా నిషేధిస్తే నేరాలు అదుపు చెయ్యడానికి అవకాశం ఉంటుందని అయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.