పోర్న్ సైట్లని ఆపేయండి ..మోడీకి నితీష్ వినతి !

Update: 2019-12-17 07:35 GMT
ప్రస్తుత రోజుల్లో మహిళలపై జరిగే దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనితో ఆడవాళ్లు ఇంట్లో నుండి రావడానికి కూడా భయపడిపోతున్నారు. అలాగే ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకి వెళ్లిన తమ కూతురు మళ్లీ ఇంటికి వచ్చేవరకు టెంక్షన్ తోనే జీవితం కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ మద్యే హైదరాబాద్ లో జరిగిన దిశ ఉదంతం గురించి అందరికి తెలిసిందే. ఒక వెటర్నరీ డాక్టర్ ని .. ఒక పక్కా ప్లాన్ తో నమ్మించి అతి కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసారు.

ఈ నేపథ్యంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళల పై పెరుగుతున్న లైంగిక నేరాలకు పోర్న్ సైట్లు కారణమని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అన్ని పోర్న్ సైట్లను, అనుచిత కంటెంట్ ని నిషేధించాలని  ప్రధాని మోదీకి రాసిన లేఖలో  విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో నితీష్ కుమార్ పెరుగుతున్న గ్యాంగ్ రేప్ కల్చర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఇవి సాధారణ ప్రజలను భయాందోళనలకు గురి చేశాయని అయన స్పష్టం చేశారు.

ప్రజలు ముఖ్యంగా పిల్లలు మరియు యువకులు అపరిమితమైన హింసాత్మక, అనుచితమైన కంటెంట్‌ ను ఇంటర్నెట్‌ లో చూస్తున్నారు, ఈ సైట్ల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో సామూహిక అత్యాచారం, మహిళలపై నేరాలు లాంటి సంఘటనలు జరుగుతాయని ఆయన చెప్పారు.దీని ప్రభావంతో నిందితులు బాలికలు, మహిళలపై అత్యాచారం యొక్క వీడియోలను తయారు చేస్తారు. వాటిని వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారు. పిల్లలు, యువకుల మనస్సులను తీవ్రంగా ప్రభావితం చేసే ఇటువంటి కంటెంట్ నేరాలకు కారణమవుతోందని నితీష్ తెలిపారు. ఇటువంటి కంటెంట్‌ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం అనేది కొంతమంది వ్యక్తుల మనస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, ఇది సామాజిక సమస్యలకు దారితీస్తుంది, మహిళలపై నేరాల సంఖ్యను పెంచుతుందని సిఎం అన్నారు.
Tags:    

Similar News