నితీశ్ సాబ్ మరీ అంత ఇరిటేషన్ ఎందుకు?

Update: 2019-10-02 12:09 GMT
పెద్దమనిషిలా ఉండే రాజకీయ నేతలకు సైతం కోపం కట్టలు తెచ్చుకుంటోంది. తమ కారణంగా తప్పులు జరిగితే గతంలో బుద్దిగా క్షమాపణలు చెప్పి చెంపలేసుకునే వారు. తప్పు దిద్దుకుంటామని చెప్పేవారు. అందుకు తగ్గట్లే తప్పుల కారణంగా జరిగిన నష్టాన్ని వీలైనంతవరకూ తగ్గించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. తప్పుల్ని ఒప్పుకోవటం.. లోపం ఎక్కడుందన్న విషయాన్ని అడిగి తెలుసుకోవటం చేసి.. పరిస్థితి సర్దుకునేలా చేసేవారు.

అయితే.. ఇదంతా జమానాలోనే. ఇప్పుడంతా దబాయింపు రాజ్యమే. పాలకుల్లో ఇలాంటి తీరు అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కాస్త భిన్నం బిహార్. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ కు కాస్త పెద్దమనిషి అన్న పేరు. సాత్వికుడిగా చెబుతారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లరన్న పేరుంది. అలాంటి ఆయన అనవసరమైన అంశంలో చిక్కుకొని ఇప్పుడు మీడియాలో నానుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో వానలు కుమ్మేశాయి. వర్షపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సగటు జీవులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. వరదనీటిలో చిక్కుకుపోయిన వారే కాదు.. వరదల్లో చిక్కుకున్న భవనాలు ఎక్కువే. ఇక.. లోతట్టు ప్రాంతం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదన్నట్లుగా పరిస్థితి ఉంది.

ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి నితీశ్ ఎదుట ప్రశ్నించారు. అంతే.. పెద్దాయనకు కోపం కట్టలు తెగింది. వరదలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అవసరానికి అనుగుణంగా చేపడతామనే కాదు.. గతంలో భారీ వర్షాలు.. వరదలు సంభించినప్ప్ుడు ఇలాంటివి చోటు చేసుకోలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేస్తుందో కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారే.. అంటూ ఫైర్ అయ్యారు.

వరదలు సంభవించిన వేళ.. అమెరికాలో ఏం జరిగిందో.. ముంబయిలో ఏమైంది? అంటూ ప్రశ్నించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టలేకపోటానికి.. పెద్ద ఎత్తున మరణాలకు కారణంపై ముఖ్యమంత్రుల వారు సిగ్గు పడాల్సింది పోయి.. రివర్స్ గేర్ లో మీడియాను ఏసుకోవటం ఏందో?
Tags:    

Similar News