విశాఖ జిల్లాపై జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కడ ఉంటుందనే ప్రశ్నకు సమాధానంగా విశాఖ జిల్లా పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో పవన్ పార్టీ కొన్ని సీట్లలో గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలున్నాయి. జనసేన అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలిందట.
గాజువాకలో జనసేనకు గట్టి అవకాశాలున్నాయనే భావనతో పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మరి విశాఖ పరిధిలో జనసేన స్టార్ లు పోటీలో ఉండగా.. అదే జిల్లాలో ఒక నియోజకవర్గంలో జనసేనకు అభ్యర్థే లేకుండా పోవడం గమనార్హం.
విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేనకు అభ్యర్థి లేకుండా పోయారు. ముందుగా ఈ నియోజకవర్గం నుంచి వేగి దివాకర్ అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. ఆయనకే టికెట్ ను ఇచ్చారు. అయితే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురి అయ్యింది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన నామినేషన్ ను తిరస్కరించింది ఈసీ.
ఇక ఇదే నియోజకవర్గం నుంచి జనసేన రెబల్ గా ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. బైపిరెడ్డి అశోక్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి జనసేన రెబల్ గా నామినేషన్ వేశారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆయన కూడా నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.
ఈ నేఫథ్యంలో.. నర్సీపట్నంలో జనసేనకు అభ్యర్థి లేకుండా పోయారు. ఇక జనసేన మిత్రపక్షాలు కూడా ఏవీ ఇక్కడ నామినేషన్ వేయలేదు. దీంతో అక్కడ పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీల మధ్యనే నెలకొంది!