‘‘ఇచ్చట మూత్రం పోయలేరు’’

Update: 2016-07-24 10:07 GMT
పట్టణాలు - నగరాల్లోని నివాస ప్రాంతాలు - పబ్లిక్ ప్లేసుల్లో ‘‘ఇచ్చట మూత్రం పోయరాదు’’ అన్న బోర్డులు కనిపిస్తుంటాయి. భారతదేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన అలవాటు ఎక్కువ కావడంతో పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు గాను ఇలాంటి బోర్డులు పెడుతుంటారు. అయితే.. నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం వద్ద మాత్రం ఇంకో రకమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ టాయిలెట్లు లేకపోవడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారట.  దీంతో కొందరైతే ఆ అవసరాలు తీర్చుకోవడానికి విజయవాడ వచ్చి వెళ్తున్నారట.
    
ఇటీవల శాఖల తరలింపు తరువాత అక్కడ పనిచేసేందుకు వెళ్లిన దాదాపు 50 మంది ఉద్యోగులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవని ఆరోపిస్తూ - వెను దిరిగారని తెలుస్తోంది. మరో అధికారి రెస్ట్ రూమ్ కోసం కారులో విజయవాడ వరకూ వెళ్లాల్సి వచ్చిందట. చాలామంది ప్రస్తుతం ఇలాగే విజయవాడ వెళ్లివస్తున్నామని చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం డెడ్ లైన్ ఏడవ సారి కూడా మిస్ అయిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. విద్యుత్ సరఫరా పనులు పూర్తి కాలేదని, సరైన సదుపాయాలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగుల తరలింపు పేరిట హడావుడి చేస్తోందంటూ, ఓ ఆంగ్ల పత్రిక 'నో టాయిలెట్స్ గురూ' అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
    
దీంతో ఇలా సౌకర్యాలు లేకపోతే ఎలా అంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యే వరకూ అక్కడ మరే కొత్త విభాగం ప్రారంభించకపోవడమే బెటరని సూచిస్తున్నారు. చంద్రబాబు కడుతున్న విశ్వనగరంలో ఎవరూ మూత్రం పోయకూడదేమో మరి. లేదంటే... ఇలా పక్క నగరాలకు వెళ్లి పోసుకుని రావాలేమో.
Tags:    

Similar News