ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది పాకిస్తాన్ 20-20 కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ తీరు. పొరుగుదేశమైన పాకిస్తాన్ భారతదేశంతో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సైనికులపై కాల్పులు, మన భూభాగంలోకి చొరబటడటం వంటి రెచ్చగొట్టే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భారత్ ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ లో యూఏఈలో భారత్-పాకిస్తాన్ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరిస్ పై కూడా మనదేశం ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసక్తి కనబరుస్తున్నా....బీసీసీఐ మాత్రం ముందుకురావడం లేదు. విషయాలన్నీ ఇలా ఉంటే ఆఫ్రిదీ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
మ్యాచ్ గురించి భారత్ తో ఇంత చర్చించాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఈ క్రమంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. పాకిస్తాన్ పదేపదే టీమిండియాతో చర్చిండం అస్సలు అవసరం లేదంటూ.....టీమిండియాతో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించాడు. భారత్ కే ఇష్టం లేనపుడు మనం ఎందుకు వారితో చర్చించాలి అంటూ పాకిస్తానీ బుద్దితో మాట్లాడాడు. భారత్ తో చర్చలు ఆపేసి ఇతర దేశాలను పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు, పర్యటించేందుకు ఆహ్వానించాలని తమ దేశ బోర్డుకు ఉచిత సలహా ఇచ్చారు.
ఇన్నిమాటలు చెప్పిన ఆఫ్రిదీ భారత దేశం ఎందుకు పాకిస్తాన్ తో క్రికెట్ అంటే ఆసక్తి చూపించడం లేదో మాత్రం ప్రకటించలేదు. అదే క్రమంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎందుకు ఇరుదేశాలు ముందుకువెళ్లడం లేదు అని కూడా ఆలోచించడం లేదు. 2012-13 తర్వాత భారత్-పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ సిరిస్ జరగలేదు.