కరోనాతో ఢిల్లీ అల్లాడుతోంది. అక్కడ పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. రోజురోజుకీ గంట గంటకీ ఆక్సిజన్ కొరతతో దిక్కుతోచని స్థితిలో పరిస్థితులు ఉన్నాయి.
తాజాగా ఢిల్లీలోని శాంతిముకుంద్ ఆస్పత్రి చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోవ వస్తోందని.. మహా అయితే రెండు గంటలు.. లేదా అంతకన్నా ముందే అయిపోతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
డిశ్చార్జి చేయాల్సిన రోగులను వెంటనే డిశ్చార్జి చేయాలని డాక్టర్లను కోరారు. ఎన్నడూ లేని రీతిలో కరోనా సంక్షోభం వెంటాడుతోందని ఆస్పత్రి చీఫ్ వాపోయారు.
తమ ఆస్పత్రిలో 110 మంది రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని.. 12 మంది రోగులు వెంటిలేటర్ పై ఉన్నారని ఆస్పత్రిచీఫ్ తెలిపారు. సుమారు 85మంది రోగులకు కొంత సమయం మేరకు దీన్ని ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. ఈ రోగుల్లో క్యాన్సర్ తో బాధ పడుతున్న వారు.. గుండె జబ్బులు ఉన్న వారు కూడా ఉన్నారని తెలిపారు. వీరికి ఆక్సిజన్ అత్యంత అవసరం అని.. ప్రస్తుతం ఆక్సిజన్ ఆస్పత్రిలో అయిపోతుండడంతో దయనీయ పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో కరోనా తీవ్రతతో ఆస్పత్రుల్లోని పరిస్థితులకు అద్దం పడుతోంది.
https://twitter.com/ANI/status/1385159145720934400?s=20