జనసేనలోకి అన్నయ్యను పిలిచేది లేదు

Update: 2016-04-11 04:54 GMT
కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం పవర్ స్టార్ కమ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలవాటే. మనసులో ఏం అనిపిస్తే అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం. మాట్లాడే ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపించటం పవన్ నైజం. అదే.. ఆయన్ను చాలామందికి దగ్గర చేస్తుంది. తాజాగా ఆయన కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా అడిగిన అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధాను చెప్పేశారు.

రానున్న రోజుల్లో జనసేన పార్టీలో అన్నయ్య చిరంజీవిని తీసుకొని వస్తారన్న ఊహాగానాలు భారీగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పవన్ కు ఇలాంటి ప్రశ్నను సంధించారు. జనసేనలో చిరంజీవి అన్న అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్.. చిరంజీవిని ఆహ్వానించే అవకాశం మీద స్పందిస్తూ.. అన్నయ్యను ఆహ్వానించేది లేదని.. రాజకీయంగా అన్నయ్య తన ప్రత్యర్థి అన్న విషయాన్ని పవన్ చెప్పేశారు. చిరంజీవి పూర్తిస్థాయి కాంగ్రెస్ వాది అన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారు.

ప్రశ్నించటం కోసం.. బాధలు చెప్పుకోవటం కోసం.. చాలా విషయాల్నిజనాలకు చెప్పేందుకు మాత్రమే తాను జనసేనను పెట్టానని.. పదవుల కోసం కానే కాదన్న పవన్.. 2019 ఎన్నికల్లో తమ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుందని చెప్పారు. అయితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయం మీద స్పష్టంగా చెప్పలేనని చెప్పటం గమనార్హం. మొత్తంగా జనసేనలో తన అన్న చిరంజీవి స్థానం లేదన్న విషయం మీద పవన్ పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేసినట్లే.
Tags:    

Similar News