ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా ఇటీవల కొన్ని అనూహ్యమైన వార్తలు చెలామణిలోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ లో తెరమీదకు వచ్చిన అంశం ఏమంటే ఆప్ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ తో తనకు భేదాభిప్రాయాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం. విశ్వాస్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆప్ ప్రభుత్వాన్ని, కేజ్రీవాల్ ను పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. అంతేకాకుండా దీనికి అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు.
ట్విట్టర్ ద్వారానే తన భావాలను కేజ్రీవాల్ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూ క్లిప్ ను రీట్వీట్ చేసిన కేజ్రీవాల్... తనకు విశ్వాస్ పట్ల కోపం లేదని, ఆయన తన కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. ఆయన కేవలం పార్టీ సభ్యుడు మాత్రమే కాదని, వాస్తవానికి తన కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. అలాంటి విషయాలపై రాద్దాంతం చేయడానికి మీడియా ఇష్టపడుతుందని విమర్శించారు. అంతేకాదు తనపై కొత్త విమర్శ వస్తుందని జోష్యం చెప్పారు. ఇకపై ‘‘నా భార్య నన్ను టార్గెట్ చేస్తున్నట్లు’’ మీడియా ప్రచారం చేయగలదని చమత్కారంతో కూడిన విమర్శ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/