రాజాసింగ్‌పై స‌స్పెన్ష‌న్ వేటు.. బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2022-08-23 10:27 GMT
తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా.. వ్య‌వ‌హ‌రిస్తున్న ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం స‌స్పెన్ష‌న్‌ వేటు వేసింది. గ‌త రెండురోజులుగా రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకు ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

మునావ‌ర్ షో విష‌యంతో మొద‌లైన ఆయ‌న ర‌గ‌డ‌.. తాజాగా మ‌హమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కు వెళ్లింది. ఆదిలో బీజేపీ అధిష్టానం కొంత సంయ‌మ‌నం పాటించినా.. త‌న‌ను సస్పెండ్ చేసినా ఫ‌ర్వాలేదు..  అంటూ.. రాజా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో అన్ని కోణాల్లోనూ ఆలోచించిన బీజేపీ అధిష్టానం.. తాజాగా రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ప్ర‌స్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో.

సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. ప్ర‌స్తుతం బీజేఎల్పీ నేత‌గా ఉన్న ఆయ‌న‌ను ఆ  పోస్ట్ త‌క్ష‌ణ‌మే తప్పిస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ మేర‌కు జాతీయ బీజేపీ కార్య‌వ‌ర్గం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది.

భారీ దెబ్బ‌! మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎలా ఉన్నప్ప‌టికీ.. బీజేపీకి ఎన్నిక‌ల ప‌ర్య‌వ‌సానం తీవ్రంగా ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. చేజేతులా.. అధికార పార్టీకి అస్త్రాలు ఇచ్చిన ట్టు అవుతుంద‌ని కూడా అంటున్నారు.

ఎన్ని కాయ‌క‌ల్ప చికిత్స‌లు చేసినా.. ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. బీజేపీ వ‌స్తే.. మ‌త ఘ‌ర్స‌ణ‌లు ఖాయ‌మ‌ని అధికార పార్టీ ఇప్ప‌టికే ప్ర‌చారం అందుకుంది. ఇప్పుడు రాజా వ్య‌వ‌హారం.. మ‌రింత‌గా అధికార పార్టీకి క‌లిసి రానుంది.  ఈనే ప‌థ్యంలో మునుగోడులో బీజేపీకి దెబ్బ‌త‌ప్ప‌ద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News