'మీ ఎమ్మెల్యేలకు అంత రేటు పెట్టడం కూడా వేస్టే!'

Update: 2019-07-21 16:56 GMT
రాజకీయాల్లో ఆరోపణలు - ప్రత్యారోపణలు కొత్త పుంతలను తొక్కుతున్నాయి. ఒక పార్టీ వాళ్లేమో తమ పార్టీ  ఎమ్మెల్యేలను ప్రత్యర్థులు కొనుగోలు చేస్తున్నారని, కోట్లు ఇచ్చి చేర్చుకుంటున్నారని ఆరోపిస్తుంటే - మరో పార్టీ వాళ్లేమో  మీ ఎమ్మెల్యేలకు అంత డబ్బులు ఇవ్వడమే వేస్టంటూ - మీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చేంత అమాయకులం తాము  కాదంటూ అంటున్నారు!

ఈ చిత్రమైన ఆరోపణలు ప్రత్యారోపణలు పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల రూపాయల చొప్పున ఇస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ సర్కారులో ని బోలెడంత మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని ప్రధాని మోడీతో సహా పలువురు బీజేపీ  నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మమత స్పందించారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఒక్కోరికి రెండు కోట్ల రూపాయల చొప్పున ఇస్తోందని ఆమె అన్నారు. అయితే బీజేపీ ఇందుకు కౌంటర్ ఇచ్చింది.

తాము రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొనటం లేదని చెప్పడానికి - 'మీ ఎమ్మెల్యేలకు అంత ధర పెట్టడం కూడా వ్యర్థమే' అని కమలం పార్టీ నేతలు అంటున్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఏ మాత్రం సానుకూలత లేదని - అలాంటి వారిని తాము  రెండు కోట్లు ఇచ్చి ఎందుకు కొనుక్కొంటామని కమలనాథులు అంటున్నారు!

అంతే అంతకన్నా తక్కువ ధరకు కొంటున్నట్టుగా - కొనడానికి రెడీగా ఉన్నట్టుగా - చౌకబేరం ఆడటానికి సిద్ధంగా ఉన్నట్టుగా బీజేపీ వాళ్లు చెబుతున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు!


Tags:    

Similar News