నై జ‌గ‌న్ : ఆ రెండు ప‌థ‌కాలూ నో యూజ్! న‌ష్టం : 12,000 కోట్లు

Update: 2022-06-07 07:06 GMT
విశాఖ మొద‌లుకుని అనంత‌పురం వ‌ర‌కూ ఓ రెండు పథ‌కాల‌పై త‌రుచూ నెగెటివ్ కామెంట్లు వ‌స్తున్నాయి. వీటిని నిలుపుదల చేయ‌డ‌మో లేదా ప‌థ‌కం అమ‌లులో ముందు ఉంచిన నియమ నిబంధ‌న‌లు  మార్చ‌డ‌మో చేస్తే బెట‌ర్ అన్న వాద‌న‌లూ మ‌రియు అభిప్రాయాలూ విన‌వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కారుకు ఫిర్యాదులు వినే ఓపిక, త‌ప్పులు దిద్దుకునే సంయ‌మనం లేదా ప‌రివ‌ర్త‌న గుణం ఉంటే ఆ రెండు ప‌థ‌కాల కోసం కేటాయించిన డ‌బ్బులు ఏవీ వృథా కావు. ఆ ప‌థ‌కాలే ఒక‌టి వైఎస్సార్ జ‌ల‌క‌ళ కాగా, రెండు ఈ ఏడాదికి సంబంధించి  ఇవాళ ఆరంభానికి నోచుకోనున్న వైఎస్సార్ యంత్ర సేవా ప‌థ‌కం.

వాస్త‌వానికి జ‌ల‌క‌ళ కింద ప్ర‌తి జిల్లాలో రైతులకు ఉచితంగా బోర్లు వేయాల్సి ఉంది. వీటికి విద్యుత్ క‌నెక్ష‌న్లు కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవేవీ జ‌ర‌గ‌క‌పోగా  ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. దీంతో ప్ర‌భుత్వ నిధులు రూ.2,340 కోట్లు విడుద‌ల‌యినా వృథా అయ్యాయి. ఇదంతా రెండేళ్ల కింద‌టి మాట. అంటే ఇప్పుడు ఎంత మేర‌కు నిధులు వృథా అయ్యాయో ఏంటో అన్న‌ది ఇంకా లెక్క‌లు రావ‌డం లేదు.

దీనిపై మొన్న‌టి వేళ విశాఖ జెడ్పీ స‌మావేశం ద‌ద్ద‌రిల్లిపోయింది. ఇదే పథ‌కం అమ‌లు బాలేద‌ని శ్రీ‌కాకుళంలోనూ ఫిర్యాదులు ఉన్నా మంత్రులు వినిపించుకోవ‌డం లేదు. అటు అమ‌ర్నాథ్ కానీ ఇటు బొత్స కానీ ఈ ప‌థ‌కం లోపాలు దిద్ద‌మ‌ని ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేయ‌డం కానీ క‌నీస స్థాయిలో సూచ‌న‌లు చేయ‌డం కానీ చేయ‌డం లేదు అన్న విమ‌ర్శ‌లున్నాయి.

ఇక్క‌డ వైఎస్సార్ యంత్ర సేవా ప‌థ‌కం కింద గ్రూపున‌కు ఒక ట్రాక్ట‌ర్ ఇవ్వ‌డం క‌రెక్ట్ కాద‌ని, మీరు ఎన్న‌యినా చెప్పండి ఆ విధంగా చేస్తే న‌ష్ట‌మే అని రైతులు వారి ఫిర్యాదులు అందుకు జెడ్పీటీసీలు గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రి ! ఇవాళ ఖ‌రీఫ్ ఆరంభంను పుర‌స్క‌రించుకుని రెండు వేల 16 కోట్ల‌తో కొన్ని యంత్రాలు అందుబాటులోకి తేవ‌డంతో పాటు ట్రాక్ట‌ర్లు కూడా అందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి.

అదేవిధంగా 3800  ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాల‌కు 3800 ట్రాక్ట‌ర్లు ఇవ్వ‌నున్నారు. 1440 యంత్ర సేవా కేంద్రాల‌కు వ్య‌వ‌సాయ ప‌నిముట్లు అందించ‌నున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఏడాదికి రెండు వేల కోట్లు జ‌ల‌క‌ళ‌కు, యంత్ర సేవకు మ‌రో రెండు వేల కోట్ల చొప్పున ఈ మూడేళ్ల‌లో 12 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం వృథా చేసింద‌ని, స‌రైన ప్ర‌ణాళిక లేని కార‌ణంగానే ఇలా అయింద‌న్న ఆరోప‌ణ‌లు స్వ‌ప‌క్షం నుంచి ముఖ్యంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి వ‌స్తున్నాయి.
Tags:    

Similar News