ఏమీ సాధించావు బాబూ...!

Update: 2018-07-20 14:41 GMT
అనుకున్నదే అయింది వూహించినదే జరిగింది. నాలుగేళ్లుగా కదలని ప్రత్యేక హోదా రైలు ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నట్లు ఉంది. నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కాపురం చేసి ఇప్పుడు వారితో కయ్యానికి దిగానని చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధించింది సూన్యమని మరోసారి తేలింది. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల రాష్ట్రానికి ఏమి న్యాయం జరగలేదు. పొడిచేస్తాం - కత్తులు దూస్తాం అని ఉత్తరకుమారుని ప్రగల్బాలు పలికిన తెలుగు తమ్ముళ్లకు ఆశ భంగం ఎదురైంది.

శుక్రవారం లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై ముందుగా గుంటూరు లోక్‌ సభ సభ్యుడు గళ్లా జయదేవ్ గళం విప్పారు. గడచిన కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం ఇతర నాయకులు ఏకరవు పెట్టిన అంశాలనే మళ్లీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరమో - దాని వల్ల తాము ఎంత అభివ్రుద్ధి చెందుతామో గళ్ల వివరించలేకపోయారు. అధికారంలో ఉన్న బిజేపితో పాటు సభలోని ఇతర పార్టీలను తన ప్రసంగం ద్వారా ఆకట్టుకోలేకపోయారు. ఎంతసేపు ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గర్తు చేయడం మినహా కొత్త అంశాలేవి ఎంపీ గళ్ల జయదేవ్ సభముందు ఉంచలేదు.

 సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎంపీ గళ్లా జయదేవ్ చేసిన ప్రసంగాన్ని శ్రద్దగా విన్నాను అని మాత్రమే అన్నారు. ఇందులో గళ్లా ప్రసంగంలో పస లేదనే వెటకారం దాగి ఉంది.అవిశ్వాస తీర్మానం పెట్టడం సభలో చర్చిచడం మాత్రమే జరిగాయి.ఈ రెండు విషయాలు తప్ప బ్రహ్మండం బద్దలవుతుందని తెలుగుదేశం వారు చేసిన హంగామ నెరవేరలేదు. ఈ మాత్రం దానికి రాష్ట్ర ఆర్దిక మంత్రి యనమల రామక్రుష్ణుడు తో పాటు పలువురు ఉన్నాధికారులు చేసిన కసరత్తు ఏమిటో అర్దంకాలేదు. లోక్‌ సభలో జరిగిన ఈ తతంగం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను ఏమి సాధించానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Tags:    

Similar News