ముక్క లేకపోతే ముద్ద దిగని రోజులివి. ఆదివారమొచ్చిందంటే చేపల మార్కెట్ నుంచి మటన్ షాప్ వరకు రోజంతా కిటకిటలాడుతాయి. ప్రజల్లో నాన్ వెజ్ వాడకం ఆ స్థాయిలో పెరిగింది మరి. ఒకటీ అరా కుటుంబాలు శనివారం - సోమవారం - గురువారం అంటూ కొన్ని రోజులు తినడం మానేస్తున్నా మిగతా రోజుల్లో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నారు. ఇంట్లో వండుకున్నా.. హోటల్ కు వెళ్లినా చికెనో - మటనో కావాల్సిందే. అలాంటిది పదిహేను రోజుల పాటు ఒక సిటీలో ఎక్కడా నాన్ వెజ్ అన్నది దొరక్కపోతే ఏమవుతుంది.. ప్రజల నాలుకలు వంకర్లు తిరిగిపోతాయేమో. ఇప్పుడు విజయవాడలో మరో రెండు రోజుల్లో నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు మొదలుకానున్నాయి. ప్రభుత్వం వారితో బలవంతంగా శాకాహార దీక్ష చేయించబోతోంది. అవును... విజయవాడలో 16 రోజుల పాటు నాన్ వెజ్ పై నిషేధం విధించారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.
పవిత్ర కృష్ణా పుష్కరాల దృష్ట్యా ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకూ విజయవాడ పరిసరాల్లో మాంసం - చేపలు తదితరాల విక్రయాలనునిషేధిస్తున్నట్టు నగర కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు అన్ని కబేళాలనూ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన, హోటళ్లలో సైతం మాంసాహారాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. నగరానికి వచ్చే భక్తులు - యాత్రికుల మనోభావాలను వ్యాపారులు అర్థం చేసుకుని సహకరించాలని కోరిన ఆయన, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
కాగా సముద్ర తీర జిల్లా కావడం... కొల్లేరు సరస్సు ఉండడం.. నగరంలోంచి కృష్ణా నది ప్రవహిస్తుండడం... జిల్లాలో చేపల - రొయ్యల చెరువులు విస్తారంగా ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల విజయవాడలో చేపల వినియోగం అధికంగా ఉంటుంది. ఇక చికెన్ - మటన్ వినియోగం కూడా ఎక్కువే. ఈ క్రమంలో నిషేధం కారణంగా 16 రోజుల పాటు వీరి వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. తీవ్ర ప్రభావం పడబోతోంది. అంతేకాదు.. చాలామంది ఉపాధికి కూడా ఇబ్బంది ఏర్పడనుంది. మరోవైపు విజయవాడ ప్రజలు కూడా ముక్క తినకుండా అన్ని రోజులు ఎలా ఉండగలం అంటున్నారు.