ఇండియా టాప్ 500 కంపెనీస్ లో ఏపీలో ఒక్కటి కూడా లేదా?
అసలే కరోనా కాలం.. ఆపై ఆర్థిక కల్లోలం..ఇంతటి కష్టకాలంలో భారత ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు కూడా అప్పుల కోసం దొరికిన కాడల్లా చేతులు చాచుతున్నాయి. అప్పులతోనే సహవాసం చేస్తున్నాయి.
కరోనా పరిస్థితుల్లోనూ ఈ ఏడాది భారత్ లోని అగ్రగామి 500 కంపెనీల నికర వ్యాల్యూ సగటున 68శాతం పెరిగినట్లు బర్గండీ ప్రైవేటు హూరున్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 500 కంపెనీల మొత్తం నికర వ్యాల్యూ రూ.228 లక్షల కోట్లు ఉంది.
ఇది జీడీపీ కంటే ఎక్కువ. ఏడాదిలో ఈ కంపెనీల వాల్యూ రూ.90 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో 200 కంపెనీల వ్యాల్యూ రెండింతలు పెరిగింది. ఈ కంపెనీల విక్రయాలు రూ.58 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం జీడీపీలో 26 శాతానికి ఇది సమానం. దేశవ్యాప్త సిబ్బందిలో 1.5 శాతానికి ఈ కంపెనీలు ఉపాధిని కల్పిస్తున్నాయి.
దేశంలోనే టాప్ కంపెనీల జాబితా రిలీజ్ అయ్యింది. ఈ జాబితాలో ఆశ్యర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ లోని 29 ప్రైవేటు కంపెనీలు టాప్ 500లో చోటు సంపాదించడం విశేషం. వీటి మొత్తం విలువ ఏకంగా రూ.6.9 లక్షల కోట్లు కావడం విశేషం.
వీటిలో అత్యంత విలువైన కంపెనీగా దీవీస్ లేబోరేటరిస్ నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో హిందుస్థాన్ జింక్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి. మొత్తం కంపెనీల్లో 15 కంపెనీలు హెల్త్ కేర్ రంగానికి చెందినవే ఉన్నాయి. ఈ 29 కంపెనీల్లో మొత్తం 2 లక్షల మంది పనిచేస్తున్నారు.
దేశవ్యాప్తంగా టాప్ 500 కంపెనీల్లో ఏపీ నుంచి ఒక్కటీ లేకపోవడం ఆ రాష్ట్ర ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. మొదట చంద్రబాబు పాలనలో కంపెనీలకు పెద్దపీట వేసినా జగన్ రాకతో కొన్ని కంపెనీలు ఇబ్బందులు పడ్డాయి. ప్రతీకార రాజకీయాలతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎత్తేయడం.. మరికొన్ని రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి.
ఇక కొత్త కంపెనీలేవీ కూడా ఏపీ వైపు రాని పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ ఆకర్షిస్తున్నాయి. ఏపీలో ఏమో ఉన్న కంపెనీలకే ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి. పెట్టుబడుల ఆకర్షణ అనేదే లేదు.
ఈ క్రమంలోనే టాప్ 500 కంపెనీల్లో ఏపీ నుంచి ఒక్క కంపెనీ లేకపోవడం గమనార్హం. ఇక ఉమ్మడి ఏపీలోనూ హైదరాబాద్ కు పెద్దపీట వేయడం.. ఆరాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టడంతో ఏకంగా 29 కంపెనీలు టాప్ 500 లో చోటుదక్కించుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికైనా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.