ట్రంప్ కిమ్ దోస్తీ ఉత్త భ్ర‌మ‌..ఇదిగో కొత్త క‌ల‌క‌లం

Update: 2018-08-18 06:24 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఇంతెత్తున్న ఎగిరిప‌డే ఉత్త‌ర‌కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్ కొద్దికాలం క్రితం ఆయ‌న‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దిన సంగ‌తి తెలిసిందే. సింగపూర్‌ లో జరిగిన ట్రంప్-కిమ్ చారిత్రక భేటీలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా - బదులుగా ఆ దేశానికి భద్రతతోపాటు పలు ప్రయోజనాలను అందించేందుకు అమెరికా హామీ ఇచ్చింది. చర్చల తర్వాత ట్రంప్ అమెరికాకు - కిమ్ ఉత్తర కొరియాకు తిరుగు ప్రయాణమయ్యారు. తమ భేటీ నిజమైన ఫలితాలను - ఆశించిన మార్పును తీసుకువస్తుందని పేర్కొంటూ ట్రంప్ తన అధికారిక విమానం ఎయిర్‌ ఫోర్స్ వన్ నుంచి వరుస ట్వీట్లు చేశారు.

అయితే ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మూన్నాళ్ల ముచ్చ‌టేన‌ని తేలిపోయింది. ఈ ఏడాది జూన్‌లో కిమ్‌ జోన్‌ తో సింగపూర్‌ లో జరిగిన సమావేశాన్ని చారిత్రాత్మ కమైనదిగా ట్రంప్‌ అభివర్ణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అణు కార్యక్రమంలో కొద్దిగా కదలిక వచ్చింది. అయినా పూర్తి పరిశీలించదగిన, పునర్నిర్మాణ అణు కార్యక్రమానికై అమెరికా డిమాండ్‌ చేయడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా విమర్శించింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కిమ్‌ జాంగ్‌ ఉన్ ఆమెరికాపై దాడికి దిగారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన విరోధి శక్తులపై ఆ దేశ నేత  ఆగ్రహం వ్యక్తం చేసినట్టు స్ధానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించాలని కూడా ప్రపంచ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. దీనికితోడు చైనా - రష్యా కంపెనీలు ఉల్లంఘనలకు పాల్ప డ్డాయంటూ వాటిపై అమెరికా పలు ఆంక్షలను ప్రకటించింది. వన్‌ సన్‌-కలమ్మా కోస్టల్‌ టూరిస్ట్‌ ఏరియాను పర్యటించిన సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ కొరియాపై ఆంక్షలు విధించి దిగ్బంధించడం ద్వారా విరోధశక్తులు తమ ప్రజలను అణిచివేయాలని చూస్తున్నాయని కిమ్‌ వ్యాఖ్యానించినట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కెసీఎన్ ఏ) తెలిపింది.

ఈ ప‌రిణామంతో మ‌రోమారు ప్ర‌పంచ దేశాల‌పై అణుయుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభం ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుండ‌గా...తాజాగా ఈ బెదిరింపుల ప‌ర్వంలో ఏం చోటుచేసుకోనుందో అనే భ‌యం ఆయా దేశాల్లో వ్య‌క్తం అవుతోంది. ఓవైపు ట్రంప్ మ‌రోవైపు కిమ్ త‌మ మొండిప‌ట్టును వీడ‌క‌పోవ‌డంతో...మ‌ళ్లీ అణుభ‌యం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ మీడియా క‌థ‌నాలు రాస్తోంది.
Tags:    

Similar News