ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాను చేయాలనుకున్నది చేసేందుకు ఏ మాత్రం తగ్గని తీరు కొందరు దేశాధినేతల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి సైతం తన తరహాలో పాఠాలు చెప్పే టాలెంట్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సొంతం. కఠినాతి కఠినంగా వ్యవహరిస్తూ.. భయంతో బిక్కుబిక్కుమనేలా ప్రజల్ని బతికేలా చేసే ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కానట్లుగా ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
అగ్ర రాజ్యాల బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని ఆయన.. తాజాగా తమకు సొంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన వైనం సంచలనంగా మారింది. తాజా ప్రయోగం జపాన్ కు తీవ్ర ఆందోళన కలిగించేలా చేసిన ఈ క్షిపణి లాంఛింగ్ కు సంబంధించిన వీడియో హాలీవుడ్ మూవీ స్థాయిలో టీజర్ ను కట్ చేసిన తీరు చూస్తే.. తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ఆయన ప్రయత్నం ఉందని చెప్పాలి.
తాము లాంఛింగ్ చేసిన క్షిపణికి సంబంధించిన వీడియోలో ప్రధాన ఆకర్షణగా హ్వాసాంగ్ 17 ఒక ఎత్తు అయితే.. బ్లాక్ లెదర్ జాకెట్.. సన్ గ్లాసెస్ ధరించిన ఆయన తన హావభావాల విషయంలోనూ ఇరగదీశారని చెప్పాలి. హాలీవుడ్ నటుల యాక్షన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన తీరు ఉందని చెప్పాలి. ఇద్దరు సైనికాధికుల సూచనల్ని వింటూ.. ప్రయోగ స్థలాన్ని పరిశీలించటమే కాదు.. టైం అయ్యిందన్న విషయాన్ని వాచ్ చూసుకొని.. కళ్లజోడును తీసి.. ఓకే అన్న సంకేతాన్ని ఇచ్చిన తీరు.. సదరు వీడియోకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేసేలా ఉందని చెప్పాలి.
ఈ చిట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. కిమ్ రాజసం ఎంతన్న విషయాన్ని ఈ వీడియో స్పష్టం చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు ఉత్తర కొరియా క్షిపణి సామర్థ్యం ఎంతన్న దానిపై ఉన్న సందేహాల్ని తాజా వీడియో తీర్చటమే కాదు.. అధ్యక్షుల వారు ఎంత కమిట్ మెంట్ తో ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తుందని చెప్పాలి.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. సాధారణంగా కిమ్ కు ప్రాశ్చాత్య పోకడలకు వ్యతిరేకమని చెబుతారు. అందుకే.. తమ దేశ ప్రజలు ఎవరైనా అలాంటివి చేస్తే తీవ్రంగా శిక్షలు అమలు చేస్తారు. అలాంటిది స్వయంగా కిమ్.. హాలీవుడ్ నటుల్ని అనుకరించేలా చేయటం.. తాను తయారు చేసిన వీడియో సినిమాటిక్ గా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. నీతులు ఏమైనా చెప్పేందుకే చేసేందుకు కాదన్న దానికి కిమ్ మాత్రం మినహాయింపు ఎందుకు అవుతారు చెప్పండి?