కిమ్ తో పెట్టుకుంటే ట్రంప్‌ కైనా తిప్ప‌లేనా?

Update: 2017-06-13 09:41 GMT
మొండోడు రాజు కంటే బ‌ల‌వంతుడ‌న్న‌ది సామెత‌. మ‌రి.. నిలువెత్తు మొండిత‌నం..అంత‌కు మించిన మూర్ఖత్వం మూర్తీభ‌వించిన అధినేత‌గా ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ గా చెప్పాలి. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా అంటే అస్స‌లు ప‌డ‌ని కిమ్‌.. త‌ర‌చూ అమెరికా మీద విరుచుకుప‌డుతుంటారు. అగ్ర‌రాజ్యాన్ని బూడిద కుప్ప చేయ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా మాట్లాడ‌ట‌మే కాదు.. గ్రాఫిక్ వీడియోలు వేయించుకొని మ‌రీ సంతోష‌ప‌డిపోతుంటారు.

కేవ‌లం మాట‌ల‌తో ప‌రిమితం కాకుండా అమెరికా మీద అణుదాడి చేయాల‌న్న త‌న కోరిక‌ను త‌ర‌చూ బ‌య‌ట‌పెట్టేస్తూ అందుకు అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌ల్నినిర్వ‌హిస్తుంటారు.

ప‌రీక్ష‌లు విఫ‌ల‌మ‌వుతున్నా.. ప‌ట్టువిడ‌వ‌కుండా ప్ర‌య‌త్నిస్తుండే కిమ్ ప‌ప్పులు ఉడికే ప్ర‌స‌క్తే లేద‌ని తాజాగా వ్యాఖ్య‌లు చేశారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. అమెరికా మీద అణుదాడి అసాధ్య‌మ‌ని ట్రంప్ కొట్టిపారేస్తూ ట్వీట్ చేశారు.

మ‌రి.. ఇలాంటి ట్వీట్ల‌కు మొండి కిమ్ ఊరుకుంటాడా ఏంది? త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. అణుదాడి చేయ‌టానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌ని.. న్యూయార్క్ న‌గ‌రం ఎంతో దూరంలో లేద‌ని.. కేవ‌లం 10,400 కిలోమీటర్ల దూరంలో ఉంద‌ని.. అదేం త‌మ‌కు లెక్క‌లోనిది కాద‌ని ట్వీట్ చేశాడు. తాజా ట్వీట్ లో న్యూయార్క్ న‌గ‌రాన్ని కిమ్ కోట్ చేసిన నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియా క‌న్ను ఈ మ‌హాన‌గ‌రం మీద ప‌డిందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలాఉండ‌గా..త‌మ‌ను తేలిగ్గా తీసేస్తూ ట్రంప్ చేసిన ట్వీట్‌ ను ప్ర‌స్తావిస్తూ.. ఇంట‌ర్ కాంటినెంట‌ల్ బాలిస్టిక్ మిస్సైల్ ప‌రీక్ష‌ను తాము త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తామ‌న్నారు. ఉత్త‌ర కొరియాను త‌క్కువ‌గా అంచ‌నా వేసినందుకు అమెరికా భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దంటూ త‌న‌దైన శైలిలో షాకిచ్చేలా వ్యాఖ్యానించాడు కిమ్‌. ఇంత‌లా మాట‌లు పేలిన త‌ర్వాత తెంప‌రి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News