పాత సంత‌కంతో రూ.37కోట్లు అచ్చేశారు

Update: 2015-08-03 08:57 GMT
ప్ర‌భుత్వ శాఖ‌లు ఎంత నిర్ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంటాయ‌న‌టానికి తాజా ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌. రిజ‌ర్వ్ బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రంటే ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ.. క‌రెన్సీ నోట్లు అచ్చేసే ముద్ర‌ణాల‌యంలో ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ మారి.. ఆ విష‌యాన్ని విస్ప‌ష్టంగా పేర్కొంటూ జ‌న‌వ‌రి 2014 నుంచి ముద్రించే కొత్త క‌రెన్సీ నోట్ల మీద ర‌ఘురామ్ రాజ‌న్ సంత‌కాన్ని ముద్రించాల‌ని పేర్కొంది.

అయితే.. పూర్తి అల‌స‌త్వంతో.. నిద్ర‌పోయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని దేవాస్ ముద్ర‌ణాల‌యం సిబ్బంది నిర్ల‌క్ష్యంతో రెండు నెల‌ల‌పాటు మాజీ గ‌వ‌ర్న‌ర్ సంత‌కంతో ఉన్న నోట్ల‌ను ముద్రించింది

దీన్ని గుర్తించిన ఆర్‌బీఐ ముద్ర‌ణాల‌యం అధికారుల్ని నిల‌దీయ‌టంతో వారు నీళ్లు న‌మిలే ప‌రిస్థితి. ఆర్‌బీఐ మేలుకొల్పే స‌మ‌యానికి 22.6కోట్ల నోట్ల‌ను అచ్చేశారు. ఇవ‌న్నీ రూ.20.. రూ.100.. రూ.500 డినామినేష‌న్ తో ఉన్నాయి. వీటి విలువ రూ.37కోట్లుగా తేల్చారు. ఈ నోట్ల‌ను ఆర్ బీఐ తిర‌స్క‌రించింది. తాజాగా కాగ్ ఈ విష‌యాన్ని గుర్తించి బ‌య‌ట పెట్ట‌టంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రెన్సీ నోట్ల‌ను అచ్చేసే ద‌గ్గ‌ర కూడా ఇంత నిర్ల‌క్ష్య‌మా అని ఈ విష‌యం గురించి తెలిసినోళ్లు అవాక్కువుతున్నారు.
Tags:    

Similar News