అపోలో ప్ర‌తాప‌రెడ్డికి స‌మ‌న్లు!

Update: 2018-04-10 05:08 GMT
అమ్మ మ‌ర‌ణంపై బోలెడ‌న్ని అనుమానాల‌కు తావిచ్చిన వైనానికి ఇప్పుడు స‌మాధానాలు చెప్పేసే టైమొచ్చిందా? అంటే అవున‌నే చెప్పాలి. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌న త‌మిళ అమ్మ జ‌య‌ల‌లిత‌కు జ‌రిగిన వైద్య చికిత్స‌కు సంబంధించి బోలెడ‌న్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించ‌ని ప‌రిస్థితి. ఎప్ప‌టిక‌ప్పుడు అన్న చందంగా అమ్మ ఆసుప‌త్రి వైద్యంపై స‌మాధానాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అమ్మ మ‌ర‌ణంపై నెల‌కొన్న సందేహాల్ని తీర్చేందుకు విచార‌ణ క‌మిష‌న్ ను ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురిని విచారించిన క‌మిష‌న్ తాజాగా అమ్మ‌కు వైద్యం అందించిన అపోలో గ్రూపు ఛైర్మ‌న్ ప్ర‌తాప్ సీ రెడ్డికి స‌మ‌న్లు జారీ చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. వారం రోజుల్లో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై ఉన్న అనుమానాల్ని తీర్చేందుకు అపోలో రెడ్డి స‌మాధానాలు చాలా కీల‌కంగా భౄవిస్తున్నారు.

ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత‌కు స‌న్నిహితంగా ఉన్న వారిలో ముఖ్యుల‌ను విచార‌ణ క‌మిష‌న్ విచారించింది. తాజాగా అపోలో ప్ర‌తాప్ రెడ్డి.. ఆయ‌న కుమార్తె ప్రీతి రెడ్డిని విచారించేందుకు క‌మిష‌న్ నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌మ ఆసుప‌త్రిలో అమ్మ‌కు చేసిన వైద్యంపై అపోలో ఇప్ప‌టికే నివేదిక‌ను అందించింది. ఇందులో పొందుప‌ర్చిన అంశాల‌పై ఉన్న సందేహాల్ని నివృతి చేసేందుకు క‌మిష‌న్ అపోలో రెడ్డిని.. ఆయ‌న కుమార్తెను విచారించ‌నుంద‌ని చెబుతున్నారు. క‌మిష‌న్ ముందు అపోలో రెడ్డి చెప్పే స‌మాధానాలు అమ్మ మ‌ర‌ణంపై ఉన్న సందేహాల‌కు చాలావ‌ర‌కూ స‌మాధానాలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News