కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎన్440కే వేరియంట్ ఉందని ప్రజలను భయపెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ41(ఏ) కింద ఇవాళ నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని పోలీసులు చెప్పినట్టు సమాచారం.
కర్నూలులో ప్రమాదకర కొవిడ్ మ్యుటెంట్ ఎన్-440కే వైరస్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. మూడు రోజుల క్రితం మీడియా ముఖంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారని, ప్రజలను భయపెట్టినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఈ మేరకు పోలీసులు 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా రిజిస్టర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
కాగా..ఏపీలో ఇలాంటి వైరస్ ఏదీ లేదని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, దీనికి చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ప్రధాన కారణంగా మారాయని అంటున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.