రెండు బలమైన వ్యవస్థల మధ్య ఎత్తుకు పైఎత్తులు అన్నవి ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య నడుస్తున్న పంచాయితీ సుప్రీం చెంతకు చేరింది. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయటం.. దానికి ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేస్తే..కీలక అధికారులు ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరు అయ్యారు. ఇలాంటివేళ.. సుప్రీంకోర్టు ముందుకు ఈ ఇష్యూ వెళ్లింది.
సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ఇలాంటివేళలో అనుకోని రీతిలో ఒక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటివరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏపీ సర్కారు చూపిస్తోంది. ఓవైపు టీకా.. మరోవైపు స్థానిక ఎన్నికల సాధ్యం కాదని చెబుతోంది. ఇలాంటివేళలోనే గుజరాత్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ కావటం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఎన్నికలకు అడ్డుగా ఉన్న అంశాలన్ని గుజరాత్ లో కూడా అడ్డు రావాలి. కానీ.. అలాంటివేమీ లేకుండా.. ఏపీలో మాత్రమే భిన్నమైన పరిస్థితులు ఉండటంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ప్రశ్న. గుజరాత్ లో ఫిబ్రవరి 21.. 28 తేదీల్లో రెండు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. గుజరాత్ లోని స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ కొత్త ట్విస్టుగా అభివర్ణిస్తున్నారు.మరేం జరుగుతుందో చూడాలి.