యావత్ ప్రపంచం మొత్తం కరోనా వేళ.. కంగారు పడిపోవటం ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా? దాన్ని వేసుకుందామా? అన్న ఆత్రుత పడటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా కొవిడ్ వ్యాక్సిన్ పై బోలెడెన్ని అనుమానాలతో వాటికి దూరంగా ఉన్న బ్యాచ్ ఒకటి ఉంది. అలాంటి వారిలో అత్యంత ప్రముఖులు కొందరున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా లేనిపోని సైడ్ ఎఫెక్టులు ఉన్నాయని నమ్మే ఒక బ్యాచ్ ఉంది. ఇలాంటి వారంతా ఎన్ని సమస్యలు ఎదురైనా ఫర్లేదు.. ఏదోలా మేనేజ్ చేసుకుంటామే తప్పించి.. వ్యాక్సిన్ వేసుకోవటానికి మాత్రం ఓకే చెప్పటం ఉండదు. అలాంటి కోవలోకే వస్తారు టెన్సిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.
సెర్బియా దేశానికి చెందిన ఇతడు.. నేటికి వ్యాక్సిన్ వేసుకున్నది లేదు. దీంతో.. ఆయన్ను పలు దేశాల్లో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు ప్రయత్నించటం.. ఆయా దేశాలు అతనికి వీసాలు మంజూరు చేసే విషయంలో కరాఖండిగా వ్యవహరిస్తూ.. టీకా వేసుకోలేదు కాబట్టి.. నీకు వీసా మంజూరు చేయలేం బాస్ అన్నట్లుగా తేల్చేస్తున్నాయి అతడి తరహాలోనే.
తాజాగా అతడికి అమెరికా సైతం వీసా ఇచ్చేందుకు నో చెప్పేసింది. యూఎస్ లో జరిగే ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడేందుకు అతడు వీసా కోసం అప్లై చేసుకోగా.. అందుకు వీసా నిరాకఱన జరిగింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారికి అమెరికాలోకి రానివ్వవని పరిస్థితి.
ఈ నిబంధనలోభాగంగా అతడికి వీసా ఇచ్చేందుకు అగ్రరాజ్యం నో అని చెప్పేసింది. అయితే.. కాలిఫోర్నియాలో జరిగే టోర్నీలో ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందిగా అతడు దరఖాస్తు చేసుకోగా.. నో చెప్పేస్తూ వీసాను మంజూరు చేసేందుకు నో చెప్పేసింది.
దీంతో.. అతగాడు ఇండియన్ వెల్స్ టోర్నీలో పాల్గొనేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇదే విషయాన్ని తాజాగా జకోవిచ్ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. తాను సదరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లుగా పేర్కొన్నారు. టీకావేసుకోని కారణంగా గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్.. యూఎస్ ఓపెన్ టోర్నీలకు జకోవిచ్ దూరమైన సంగతి తెలిసిందే.
ఇంత జరుగుతున్నా.. తానునమ్మిన నమ్మకానికి తగ్గట్లు.. కొవిడ్ టీకా వేసుకునేందుకు ససేమిరా అనటం కనిపిస్తుంది. తాము నమ్మిన దాని కోసం దేనికైనా సిద్ధమనే జకొవిచ్ వారు చాలా అరుదుగా ఉంటారని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.