బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానించుకోవాల్సిందేనంటూ గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించింది. కేంద్రం ఆదేశాలతో బ్యాంకులు కూడా ఆధార్ కార్డు కోసం ఖాతాదారులను నానా ఇబ్బందులు పెట్టేశాయి. అంతేనా... ఆధార్ నెంబర్లు ఇవ్వకపోతే... బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోతాయని కూడా బెదిరించాయి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ దాదాపుగా పూర్తి అయిందనుకున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా మొబైల్ నెంబర్లకు కూడా ఆధార్ కార్డులను జత చేసేకోవాల్సిందేనని ఆదేశాలు జారీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా శరవేగంగా జరిగిపోతోంది. అంటే ఇకపై ఆధార్ కార్డు అన్నింటికీ తప్పనిసరి అన్న భావన వచ్చేసింది. సర్వజనీన గుర్తింపు కార్డు పేరిట యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులను పక్కాగా అమలు చేసే బాధ్యతను ఎన్డీఏ సర్కారు కూడా భుజానికెత్తుకున్న నేపథ్యంలో ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం మాత్రం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.
ఈ కార్డు ఉంటేనే... ఏదైనా అనే పరిస్థితులు ఇప్పుడు వచ్చేశాయి. అది చట్ట పరమైనదైనా... చట్ట విరుద్ధమైనదైనా కూడా ఆధార్ కార్డు కావాల్సిందేనన్న కొత్త విషయం వెలుగులోకి వచ్చేసింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పని సరి అయిన ప్రస్తుత నేపథ్యంలో చీకట్లో గుట్టుగా జరిగే వ్యభిచారానికి కూడా ఆధార్ కార్డు కావాలనే కొత్త విషయం ఇప్పుడు వెలుగు చూసింది. కాస్తంత షాకింగ్ ఉదంతంగానే అనిపిస్తున్న ఈ ఘటన పర్యాటకుల స్వర్గధామంగా పరిగణిస్తున్న గోవాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఓ ఐదుగురు యువకులు తమలో ఒకరి బర్త్ డేను పురస్కరించుకుని బ్యాచిలర్ పార్టీ కోసం గోవాలో ల్యాండయ్యారు. ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకున్న బ్యాచిలర్స్... ఓ బ్రోకర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
గోవా లొ స్టే - పార్టీ తదితర ఏర్పాట్లన్నీ చేసిన సదరు బ్రోకర్.. చివరకు బ్యాచిలర్స్ కోరిక మేరకు అమ్మాయిలను పంపేందుకు కూడా తలూపేశాడు. ఐదుగురు బ్యాచిలర్స్ కు ఐదుగురు అమ్మాయిలను ఇప్పుడే పంపిస్తానంటూ బయలుదేరిన ఆ బ్రోకర్ ఎంతకూ తిరిగి రాలేదట. అదే సమయంలో ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్న బ్యాచిలర్స్ కు సదరు బ్రోకర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. మీ మీ ఆధార్ కార్డులను ఫొటో తీసి వాట్సాప్ లో పంపాలని - అదే విధంగా హోటల్ గదుల తాళం గుత్తులను హోటల్ ట్యాగ్ తో సహా కనిపించేలా ఫొటో తీసి వాటిని కూడా వాట్సాప్ కు పంపాలని కోరాడట. అంతే షాక్ తిన్న మన బ్యాచిలర్స్ గోవాలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధన చూసి నోరెళ్లబెట్టారట. అంటే... గోవాలో ఇప్పుడు వ్యభిచారానికి కూడా ఆధార్ కార్డు కావాల్సిందేనన్న మాట.