గ్రౌండ్ వర్కుకు మించింది మరొకటి లేదన్న సిద్దాంతాన్ని పక్కాగా ఫాలో అయ్యే వారిలో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఒకరు. ఢిల్లీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి లాగేసుకున్న వైనం తెలిసిందే. స్వచ్ఛమైన పాలన ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేతల్లో చూపించే సీఎం కేజ్రీవాల్ పుణ్యమా అని.. ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో జయకేతనం ఎగురవేయటమే కాదు.. సొంతంగా సర్కారును ఏర్పాటు చేయటం తెలిసిందే.
పంజాబ్ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవటం ఆమ్ ఆద్మీ పార్టీ చాలానే కష్టపడింది. గ్రౌండ్ లెవల్ లో భారీగా కసరత్తు చేసిన పార్టీ అంచనాలు ఏ మాత్రం మిస్ కాకుండా విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు.
పంజాబ్ విజయం తర్వాత కేజ్రీవాల్ లో కాన్ఫిడెన్సు లెవెల్స్ పెరిగినట్లుగా చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలిసే ప్రయత్నం చేసిన సందర్భంలోనూ కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించలేదని చెబుతారు. ఈ కారణంగానే వారిద్దరి భేటీ సాగలేదన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ తో డీల్ అంటే సామాన్యం కాదని.. తొందరపడితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
పంజాబ్ అయిపోయింది.. తర్వాతి రాష్ట్రం ఏది? అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఈ అంశం మీద కేజ్రీవాలే స్వయంగా స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే.. ఇప్పటివరకు చేసినట్లు కాకుండా ఈసారి ఆయన ఏకంగా రెండు రాష్ట్రాల మీద గురి పెట్టినట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.
తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా తరచూ బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకునే కేజ్రీవాల్.. తాజాగా గార్డెన్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందన్న వ్యాఖ్య చేశారు.
గతంలో తాను చెప్పినట్లే ఢిల్లీ.. పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నెలకొల్పామని.. ఇక తమ ఫోకస్ అంతా కర్ణాటక మీదనే ఉందన్నారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ వెళ్లిన సందర్భంగా ఆయన గుజరాత్ లో తాము పాగా వేస్తామన్న మాటను చెప్పటం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు ఆమ్ ఆద్మీ పార్టీని బలంగా తయారు చేసి.. తమ లక్ ను పరీక్షించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటన్న రీతిలో కేజ్రీవాల్ లక్ష్యాలు ఏ మేరకు పూర్తి అవుతాయన్నది చూడాలి.