అంతరిక్షంలో పంట చేతికొచ్చింది

Update: 2015-08-11 06:16 GMT
నేల మీదే కాదు.. అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోనూ వ్యవసాయం మొదలైంది. వ్యవసాయం చేయటమే కాదు.. తొలిసారిగా పంట చేతికి వచ్చింది. రానున్న రోజుల్లో అంరిక్ష ప్రయాణాలు మరింత పెరగటం..ఆహార సమస్యలు ఎదురు కాకుండా ఉండేలా.. సొంతంగా తమకు అవసరమైన ఆహార పదార్థాల్ని తయారు చేసుకునే చర్యల్లో భాగంగా అంతరిక్ష వ్యవసాయాన్ని షురూ చేశారు.

ఇప్పటికే రెండు పంటలు అక్కడ విజయవంతంగా పండించినట్లు చెబుతున్నారు. మొదటి పంటను పరిశోధనల నిమిత్తం భూమి మీదకు పంపగా.. తాజాగా అందుబాటులోకి వచ్చిన రెండో పంటను.. అతి త్వరలో రుచి చూడబోతున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పండించిన పంటను.. వ్యోమగాములు రుచి చూడబోతున్నారు.

వెజ్జి మొక్కల పెంపక వ్యవస్థ పేరిట చేస్తున్నవ్యవసాయంలో ‘‘రెడ్ రొమైన్ లెటూస్’’ అనే పంట చేతికి వచ్చింది. నాసా చేపట్టిన ఈ వ్యవసాయానికి అవసరమైన విత్తనాల్ని భూమి మీద రూపొందించి అంతరిక్షంలోకి పంపారు. వ్యోమనౌకలో ఉన్న వ్యోమగాములకు ఆహారం.. ఆహ్లాదం కలిగించేందుకు ఈ వ్యవసాయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

అంతరిక్షంలో వ్యవసాయం కోసం గత ఏడాది ఏప్రిల్ లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన విత్తనాల్ని అంతరిక్ష కేంద్రానికి పంపారు. 33 రోజుల వ్యవధిలోనే పంట చేతికి వచ్చింది. అయితే.. దీన్ని పరీక్షల కోసం భూమికి పంపారు. ఈ ఆహార భద్రతపై పలు పరిశోధనలు జరిపిన అనంతరం.. వీటిని తినేందుకు ఓకే చెప్పారు. తాజాగా మరోసారి పంట చేతికి వచ్చింది. దీన్ని త్వరలో వ్యోమగామలు రుచి చూడబోతున్నట్లు చెబుతున్నారు.

అంతరిక్షంలో తాము పండించిన పంటను రుచి చూడనున్నారు. మొదట వీటిని సిట్రిక్ అమ్లం ఆధారిత వైప్ తో శుభ్రం చేసిన తర్వాత తింటారని చెబుతున్నారు. వీరు పండించిన పంటలో సగభాగాన్ని తాము తినేందుకు ఉంచుకొని.. మిగిలిన సగాన్ని ప్యాక్ చేసి భూమికి పంపనున్నారు. వీటిపై పలు పరిశోధనలు నిర్వహించనున్నారు.
Tags:    

Similar News