కారణం ఏమైనా కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి డిసైడ్ అయ్యాక.. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుందని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి సీట్లో జగన్ మాత్రమే కాదు.. మరెవరు ఉన్నా అలానే సాగుతుంది.
కాకుంటే.. సీఎం జగన్ ఆదేశాలు వెంటనే అమలు కాకుంటే చోటు చేసుకునే పరిణామాల గురించి తెలిసిందే కాబట్టి.. ఉరుకులు.. పరుగుల మీద పనులు పూర్తి చేస్తుంటారు. ఆ మధ్యన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి.. దాని స్థానంలో డాక్టర్ వైఎస్సార్ వర్సిటీగా పేరు పెట్టాలని డిసైడ్ చేయటం తెలిసిందే.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ గవర్నర్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ.. సంతకం పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును యుద్ధ ప్రాతిపదికన మార్చటం మొదలైంది.
ప్రధాన భవనం మీద ఉన్న పేరు మొదలు.. వర్సిటీ ప్రారంభంలో ఉన్న పేరు వరకు.. మొత్తాన్ని ఎన్టీఆర్ పేరు స్థానే డాక్టర్ వైఎస్సార్ పేరును మార్చేశారు.
ఈ మొత్తం ప్రక్రియ గవర్నర్ సంతకం పెట్టిన 24 గంటల్లోనే పూర్తి చేయటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వర్సిటీ గోడల మీద ఉన్న పేరు మాత్రమే కాదు.. విద్యార్థులు.. సిబ్బంది ఉపయోగించే కంప్యూటర్ మొదలు కొని ఇతర సామాగ్రి మీదా ఎన్టీఆర్ పేరును కనిపించకుండా వైఎస్సార్ పేరు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఏం చేస్తారో తెలీదు.. వెనువెంటనే పేరు మారిపోవాలన్న ఆదేశానికి అనుగుణంగా.. యుద్ధప్రాతిపదికన పేరు మార్పు వ్యవహారాన్ని పూర్తి చేయటం హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.