తెలుగు సినిమా గౌరవాన్ని, తెలుగు జాతి కీర్తిని తెచ్చిపెట్టి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ యువనికపై సగర్వంగ నిలబెట్టిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దేశ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్.టి. రామారావు విగ్రహాన్ని నార్త్ అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ సిటీలో ఏర్పాటు చేయబోతున్నారు.
2023 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎడిసన్ సిటీలో ప్రత్యేక స్థలాన్ని సిటీ మేయర్ అనుమతిచ్చారని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వెల్లడించింది. లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
అలాగే రాజకీయ నాయకుడిగానూ దేశ రాజకీయాల్లో గొప్ప నాయకులలో ఒకరిగా కీర్తిని సొంతం చేసుకున్నారు.అలాంటి మహా నాయకుడి విగ్రహ ప్రతిష్టాపన నార్త్ అమెరికాలోని ఎడిసన్ సిటీలో జరగనుండటం తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
న్యూ జెర్సీ స్టేట్ లోని ఎటిసన్ సిటీలో చాలా వరకు తెలుగు వారు ఉంటున్నారు. అక్కడి మేయర్ కూడా తెలుగు వ్యక్తే కావడం విశేషం. 2023 శతాబ్ది ఉత్సావాల సందర్భంగా ఎటిసన్ సిటీలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రతిపాదనని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపకులు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి విశ్వప్రసాద్ తీసుకొచ్చారు. దీనికి అక్కడి మేయర్ శామ్ జోషీ అనుమతి ఇవ్వడంతో త్వరలో నందమూరి తారక రామారావు విగ్రహా ప్రతిష్టాపన ఎడిసన్ సిటీలో జరగబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.