బిలియనీర్లపై బిగ్ ఎఫెక్ట్!

Update: 2017-03-08 04:32 GMT
ఇండియాలో ధనవంతుల సంపదకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దెబ్బకొట్టిందట.. తాజాగా వెల్లడైన ఇండియన్ రిచెస్ట్ పీపుల్ లిస్టులో ఉన్నవారిలో చాలామంది సంపద గతం కంటే బాగా తగ్గింది.  నల్లధనం - నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న పాత 500 - 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. దీంతో దేశీయ వ్యాపార - పారిశ్రామిక రంగాల వృద్ధి కుంటుపడగా - ఆయా రంగాల్లోని సంపన్నుల సంపద కూడా పడిపోయింది.  
    
2016కుగాను హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇండియా మంగళవారం వెల్లడైంది. ఇందులో 26 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా - రెండో స్థానంలో హిందుజా కుటుంబం - మూడో స్థానంలో సన్ ఫార్మా అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 11 మంది ఈ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. వీరిలో ఈ-కామర్స్ వ్యాపారులు సచిన్ బన్సల్ - బిన్ని బన్సల్ కూడా ఉండగా - పతంజలికి చెందిన ఆచార్య బాలకృష్ణ 3.7 బిలియన్ డాలర్లతో 27వ స్థానంలో ఉన్నారు.
    
కాగా, ఒక బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగినవారు దేశంలో ఇప్పుడు 132 మంది ఉన్నట్లు తాజా జాబితా స్పష్టం చేసింది.  దేశంలో 1 బిలియన్‌ డాలర్లు అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి  132కు తగ్గింది. వీరి మొత్తం సంపద 392 బిలియన్ డాలర్లు. ఇదిలావుంటే భారత్ నుంచి 32 మంది బిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని, యుఎఇకి అత్యధికంగా 13 మంది పోయారని హరున్ రిపోర్ట్ వెల్లడించింది.. ముంబయి నగరంలో ఎక్కువగా 42 మంది బిలియనీర్లున్నారని, ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌ లో 9 మంది బిలియనీర్లున్నారట.

*  ముకేశ్‌ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

* అంబానీ తర్వాత 14 బిలియన్‌ డాలర్ల సంపదతో ఎస్‌పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు.

* సన్‌ ఫార్మా ప్రమోటరు దిలీప్‌ సంఘ్వీ కూడా 14 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.

*  12 బిలియన్‌ డాలర్ల సంపదతో పల్లోంజీ మిస్త్రీ - లక్ష్మీ మిట్టల్ - శివ్‌ నాడార్‌ వరుసగా నాల్గవ - ఐదవ - ఆరవ స్థానాల్లో ఉన్నారు.

*  సైరస్‌ పూనావాలా (11 బిలియన్‌ డాలర్లు) ఏడో స్థానంలో - అజీమ్‌ ప్రేమ్‌ జీ (9.7 బిలియన్‌ డాలర్లు) 8వ స్థానంలో - ఉదయ్‌ కొటక్‌ (7.2 బిలియన్‌ డాలర్లు) 9వ స్థానంలో నిలిచారు.

* ఇక డేవిడ్‌ రూబెన్ - సైమన్‌ రూబెన్‌ (6.7 బిలియన్‌ డాలర్లు) పదవ స్థానంలో ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News