పల్లె పోరు: ఎన్నికలకి తొలగిన అడ్డంకి .. ఆ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు!

Update: 2021-02-04 10:15 GMT
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలని అడ్డుకోవడానికి చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సఫలం కావడం లేదు. మొదట్లో మేము ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పినా , హైకోర్టు , సుప్రీం కోర్ట్ లో వచ్చిన తీర్పుతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీనితో ప్రభుత్వం ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి. ఇక ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అలాగే , నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. 9 వ తేదీ మొదటి దశలో పోలింగ్ కి ఈసీ అన్ని సిద్ధం చేస్తుంది.

ఇదిలా ఉంటే .. ఓటరు లిస్టు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. పంచాయతీ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని అఖిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2019 ఎలక్ట్రోరల్ రూల్స్ ద్వారా ఎన్నికలు జరిపిస్తే 3.60 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కింది. అయితే వాదోపవాదాల అనంతరం పిటిషన్ వాదనలు ఏకీభవించని ధర్మాసనం.. ఇప్పటికే ఎన్నికల ప్రాసెస్ ప్రారంభం అయింది అని , ఈ సమయంలో  కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది.
Tags:    

Similar News