కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో ఆప్ సర్కార్ ప్రవేశపెట్టిన సరి - బేసి ఫార్ములా విధానం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు నంబర్ చివరి అంకె బేసి కావడంతో ఆయన కారు ఇవాళ రోడ్డెక్కింది. ముఖ్యమంత్రి కారులో అరవింద్ కేజ్రివాల్ తో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రయాణించారు. కేజ్రీతో రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ - ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తమ కార్యాలయాలకు బేసి కారులో వెళ్లారు. సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ద్విచక్ర వాహనంపై, పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ సీఎన్జీ ఆటోలో, మంత్రి సందీప్ కుమార్ బస్సులో తమ కార్యాలయాలకు బయల్దేరి వెళ్లారు.
కొత్త విధానం అమలులోకి వచ్చిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ సరి-బేసి విధానం విజయవంతమైందని చెప్పారు. నేడు బేసి సంఖ్య వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని నివారించడానికి ప్రయోగాత్మకంగా కేజ్రీవాల్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పదిహేను రోజులపాటు ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాలను సమీక్షిస్తారు.