లాక్ డౌన్ గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం..!

Update: 2020-04-09 08:10 GMT
భారత్‌లో కరోనా రోగుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది.  ఈ కరోనాను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ - తగ్గడం మాత్రం లేదు. ఇక మరోవైపు కరోనా ను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ..ఈ నెల 14 తో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందా ? ఉంటే అది ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 11న ముఖ్యమంత్రులతో జరపబోయే వీడియో కాన్ఫిరెన్స్ తరువాత ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే , దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే .. ఇన్ని రోజులు పడిన కష్టం కూడా వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే  లాక్ డౌన్ పై ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంటే కొంచెం  ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న లాక్‌ డౌన్‌ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేశారు.  దీనితో  తమ రాష్ట్రానికి అప్పటివరకు ఎలాంటి విమాన - రైలు సర్వీసులు అనుమతించవద్దని కేంద్రాన్ని కోరింది. అలాగే  జూన్ 17 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఒడిశాలో 42 కరోనా కేసులు నమోదు కాగా... ఒకరు చనిపోయారు. కాగా కరోనా ను పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ ను పొడిగించే దిశగా పలు రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. 


Tags:    

Similar News