కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి నుండి ఆఫీస్ స్పేస్ కు అంతగా డిమాండ్ లేదు. అయితే ,అన్ లాక్ తర్వాత కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ రియాల్టీ, ఆఫీస్ స్పేస్ మెరుగ్గా ఉంది. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలను హైదరాబాద్ బీట్ చేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ నెట్ ఆఫీస్ స్పేస్ లీజ్ రికార్డ్‌స్థాయిలో 1.54 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో 1.18 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా ఉంది. ఈ మేరకు జేఎల్ ఎల్ డేటా వెల్లడిస్తోంది.
హైదరాబాద్ లో నివాస గృహాల కంటే కార్యాలయాల భవనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో 31 శాతం ఎక్కువ. ఆఫీస్ స్పేస్ లీజులో బెంగళూరు (504 శాతం) తర్వాత హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. మెట్రోల్లో టాప్ 2 నగరాలుగా రెండు దక్షిణాదివే ఉండటం గమనార్హం. నగరంలో ఎక్కువ శాతం ముందే జరిగిన ఒప్పందాలు ఉన్నాయి. ఇది మార్కెట్‌కు కలిసి వచ్చింది. ముందస్తు బుకింగ్స్ లేకుంటే సెప్టెంబర్ త్రైమాసికంలోను ఆఫీస్ స్పేస్ మార్కెట్‌కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఉండి ఉండేదని భావిస్తున్నారు.
ఆఫీస్ స్పేస్ లీజ్ పెరుగుతున్నప్పటికీ, వెకెన్సీలు కూడా పెరిగాయి. రెండో త్రైమాసికంలో 9.2 శాతంగా ఉన్న వెకెన్సీ లెవల్స్ సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 11.3 శాతానికి పెరిగింది. బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట బెల్ట్ లో, హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలిలో వెకెన్సీలు పెరిగాయి. ఇక్కడి నుండి చిన్న వ్యాపారాలు, చిన్న ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయి. క్యూ3లో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ 64 శాతం పెరిగింది. . ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఐటీ, ఐటీ సేవల కంపెనీల వాటా క్రమంగా తగ్గుతోంది. ఈ-కామర్స్, ఉత్పత్తి కంపెనీల వాటా పెరుగుతోంది.