వినూత్న కార్యక్రమాల్ని తెర మీదకు తీసుకురావటమేకాదు.. వాటిని అంతే వేగంగా అమలు చేసే విషయంలోనూ తన జోరును ప్రదర్శిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు.. ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలే కాదు.. పరిస్థితులు.. అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తీసుకురావటంలో తన మార్క్ ను చూపించిన జగన్ ప్రభుత్వం.. మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్ ఆర్ రైతుభరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం మీద ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా లబ్థిదారులైన రైతులకు ఎంత మొత్తం సాయంగా అందుతుందన్న సమాచారాన్ని ఆన్ లైన్ లో తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ రైతుభరోసా (http://ysrrythubharosa.ap.gov.in) పేరుతో ఒక వెబ్ సైట్ ను రూపొందించారు. ఇందులో వివరాల్ని పొందుపర్చారు.
ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్న ఈ వెబ్ సైట్ బాధ్యతలు చూసే అధికారుల నిర్లక్ష్యం వల్ల జనం విసిగిపోతు్నారు. ఈ సైట్ సరిగా ఓపెన్ కావడం లేదు. ఎర్రర్ మార్క్ వస్తోంది. ఎక్కడో ఏదో తేడా జరిగిందని.. మరోసారి ప్రయత్నించాలని కోరుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదరు వెబ్ సైట్ ను బ్రౌజ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ కు కాస్త ముందు సెక్యుర్.. నాట్ సెక్యూర్ అంటూ ప్రతి వెబ్ సైట్ కు సంబంధించి బ్రౌజర్లు చెబుతుంటాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన వెబ్ సైట్ నాట్ సెక్యూర్ అని దర్శనమివ్వటం ఏ మాత్రం సరికాదంటున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇలాంటి పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ విశ్వసనీయతకు మారుపేరుగా ఉండాలి. మరి.. ఇలాంటి సాంకేతిక అంశాల మీద కూడా ఫోకస్ చేయకపోతే.. పంటి కింద రాయిలా మారుతుంది. మరిప్పటికైనా జగన్ సర్కారు ఈ సాంకేతిక అంశాల మీద దృష్టి సారిస్తే బాగుంటుందంటున్నారు. ఇవన్నీ సాధారణ అధికారుల స్థాయి తప్పులు. వారి బాధ్యత రాహిత్యం వల్ల ఏకంగా జగన్ సర్కారుపైనే మచ్చ పడే పరిస్థితి.