అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓలా కారు ఒకటి అదుపు తప్పిన వైనం పోలీసులను వణికేలా చేసింది. ఈ రోజు (గురువారం) ఉదయం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద.. ముఖ్యమంత్రి రాకపోకలకుఅనువుగా ఏర్పాటు చేసిన గేటును ఢీ కొట్టింది.
కారు అదుపు తప్పటం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పినా.. డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. అదే సమయంలో.. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రమాదానికి గురైన కారును భద్రతా సిబ్బంది తొలగించారు. దీనికి సంబంధించిన ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద చోటు చేసుకున్న ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తమవుతోంది.