కక్కుర్తికి మించింది లేదు. దోచుకున్న దొంగసొమ్మును దొంగచాటుగా తరలించి.. కొత్తనోట్లకు కన్వర్ట్ చేసే పాడుపని చేస్తూ పెద్ద ఎత్తున దొరికిపోతున్నా.. నల్లకుబేరులకు ఏమాత్రం బుద్ధి రావటం లేదు. తమ దగ్గర మూలుగుతున్న డబ్బుల కట్టల్నిగడువు ముగిసే లోపు కొత్త నోట్లుగా మార్చుకునేందుకు పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. కోట్లాది రూపాయిల దొంగ సొమ్మును సంపాదించేందుకు ఎంత కష్టపడ్డారో కానీ.. ఇప్పుడు వాటిని కొత్తగా మార్చుకునేందుకు మాత్రం కిందామీదా పడుతున్నారు.
ఇలా మార్చే క్రమంలో అడ్డంగా బుక్ అయిపోతున్న వారున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. అక్కడి హిస్సార్ ప్రాంతం నుంచి నాగాలాండ్ లోని డిమాపూర్ కు రూ.3.5కోట్ల పాత నోట్లను మార్చేందుకు ఒక ప్రైవేట్ విమానంలో తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడి అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. ప్రైవేటు విమానాలు ఎగరాలంటే తప్పనిసరిగా అనుసరించాల్సిన నిబంధనలు ఉన్నాయి. కానీ.. వాటిని ఉల్లంఘిస్తూ.. ఎయిర్ కార్ కు చెందిన పైలెట్లు.. విమానాశ్రయ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంత భారీ మొత్తాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని బ్యాగుల్ని చెక్ చేశారు.
ఇందులో రద్దు చేసిన పాత రూ.500.. రూ.వెయ్యి నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ లు పెద్దగా లేని చిన్న చిన్న ఎయిర్ ఫీల్డ్ నుంచి పాతనోట్లను పెద్దఎత్తున తరలిస్తున్నారు. దీంతో.. చిన్న చిన్న ఎయిర్ ఫీల్డ్స్ నుంచి బయలుదేరే ప్రతి విమానాన్ని తప్పనిసరిగా సెక్యూరిటీ సిబ్బందితో తనిఖీ చేస్తున్నారు. అలా చేస్తున్న నేపథ్యంలోనే రూ.3.5కోట్ల పాత నోట్లు దొరికిపోయాయి. తనిఖీల్లోనే ఇంత పెద్ద ఎత్తున దొరికిపోతున్నా.. నల్లకుబేరులు మాత్రం తమ దొడ్డిదారి పనుల్ని మాత్రం వదిలిపెట్టటం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/