టోక్యో ఒలింపిక్స్‌లో మరో రెజ్లర్ పతకంపై ఆశలు రేకెత్తించాడు. ఒలింపిక్స్ లో శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రెజ్లర్ భజరంగ్ పునియా తన అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. ఇరానియన్ రెజ్లర్ ఘియాసి చెకాను పలుమార్లు పిన్ డౌన్ చేశాడు. తొలి రౌండ్ లో పునియా ఒక పాయింట్ వెనుకబడ్డాడు. ఇరానియన్ రెజ్లర్ ఎటాక్స్ కు మంచి డిఫెన్స్ ను పునియా ప్రదర్శించాడు. కానీ పాయింట్లు మాత్రం సాధించలేకపోయాడు. ఇర రెండో రౌండ్ ఆరంభంలో కాస్త ఒత్తిడితో కనిపించిన పునియా.. తర్వాత పుంజుకున్నాడు.
అయితే ఇరానియన్ రెజ్లర్‌ను పిన్ డౌన్ చేసి పునియా పాయింట్లు సాధించాడు. దీంతో పునియా ఫాల్ ద్వారా విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. ప్రత్యర్థిని కింద పడేసి రెండు భుజాలు మ్యాట్ కు తగిలేలా నొక్కి పెట్టడాన్ని ఫాల్ అంటారు. బాక్సింగ్ లో నాకౌట్ లాంటిదే రెజ్లింగ్ లో ఫాల్. ఇక సెమీఫైనల్ లో పునియా అజర్ బైజాన్ కు చెందిన హాజీ అలాయేవ్ తో తలపడనున్నాడు. ఇక సెమీ ఫైనల్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు భజరంగ్ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడల్ ఖాయంగా భారత్‌కు అందించనున్నాడు భజరంగ్.. లేదంటే బ్రాంజ్ మెడల్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
అంతకు ముందు భజరంగ్ పునియా శుక్రవారం ఉదయం 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కిర్గిస్తాన్ కు చెందిన ఎర్నజర్ అక్మటాలెవ్ తో జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో పునియా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఒలింపిక్స్ లో తప్పక పతకం తెస్తాడని భజరంగ్ పునియా పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చాంపియన్ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్ లో భజరంగ్ ముందే పాయింట్ సాధించాడు. ఏకంగా 3-1 ఆధిక్యంతో దూసుకొని వెళ్లాడు. ఆ తర్వాత రౌండ్లో కిర్గిస్తాన్ రెజ్లర్ గట్టి పోరాటం చేశాడు. ఒక్కో పాయింట్ సాధిస్తూ చివరకు 3-3తో స్కోర్ సమం చేశాడు. అయితే రిఫరీలు పునియాను విజేతగా ప్రకటించాడు. స్కోరింగ్ మూవ్స్ ఎక్కువగా పునియా చేయడంతో అతడిని విజయం వరించింది. కిర్గిస్తాన్ రెజ్లర్ స్కోరింగ్ మూవ్స్ కంటే పునియాను రింగ్ నుంచి బయటకు నెట్టేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో రిఫరీలు పునియానే విజేతగా ప్రకటించారు.