భార‌త క్రికెట్లో అరుదైన ఘ‌ట్టం.. ఒకే ఒక్కడు ధోనీ.. నేటికి ఎనిమిదేళ్లు!

Update: 2021-06-23 12:30 GMT
బ్యాటింగ్ తో అద‌రొట్టిన ప్ర‌తీ క్రికెట‌ర్‌.. కెప్టెన్ గా రాణించ‌లేరు. ఇందుకు ఎంతో మంది ఉదాహ‌ర‌ణ‌గా ఉన్నారు. అయితే.. అటు బ్యాటింగ్‌తో, ఇటు కెప్టెన్సీతో స‌త్తా చాట‌డ‌మే కాకుండా.. నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోని. ప్ర‌పంచంలోనే స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ల‌లో ధోనీ ముందు వ‌ర‌స‌లో ఉంటాడ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

భార‌త్ లోనూ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్ర‌పంచ క్రికెట్లోనే ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీల‌ను గెలిచి ఔరా అనిపించాడు. జ‌ట్టు బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలినాళ్ల‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను సాధించాడు మ‌హీ. ఆ త‌ర్వాత 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌కప్ అందుకొని, మువ్వ‌న్నెల ప‌తాకాన్ని విశ్వ వినువీధుల్లో రెప‌రెప‌లాడించాడు. ఆ త‌ర్వాత 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని సైతం గెలిచాడు మ‌హీ.

ఈ మూడోదైన ఛాంపియ‌న్స్ ట్రోఫీని గెలిచి నేటితో స‌రిగ్గా ఎనిమిది సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఫైన‌ల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జ‌ట్టుతో పోటీ ప‌డింది భార‌త జ‌ట్టు. అయితే.. ఈ మ్యాచ్ కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో.. 50 ఓవ‌ర్ల మ్యాచ్ ను 20 ఓవ‌ర్ల‌కు కుదించారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా 129 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత ఛేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ జ‌ట్టు 124 ప‌రుగులు చేసింది. 6 ప‌రుగుల‌తో ట్రోఫీని కోల్పోయింది.

ఈ టైటిల్ గెల‌వ‌డంతో అభిమానుల‌తోపాటు క్రికెట్ ప్లేయ‌ర్లు సైతం ఎంతో సంద‌డి చేశారు. ట్రోఫీని అందుకున్న త‌ర్వాత కోహ్లీ గంగ్నం డ్యాన్స్ కూడా చేసి ఎంజాయ్ చేశాడు. ఈ మ‌ర‌పురాని ఘ‌ట్టానికి ఎనిమిదేళ్లు నిండిపోయాయి. అదే స‌మ‌యంలో.. ప్ర‌పంచంలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న తొలి, ఏకైక కెప్టెన్ గా క్రికెట్ చ‌రిత్ర‌లో మిగిలిపోయాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ.


Tags:    

Similar News