ఉరి మళ్లీ తప్పినట్టేనా ? విచారణ 5కి వాయిదా ..

Update: 2020-02-25 13:30 GMT
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో మరో ట్విస్ట్. వీరు దోషులుగా తేలినప్పటికీ పలు ధపాలుగా వీరి ఉరి శిక్ష అమలు వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పటికప్పుడు ఉరి శిక్ష అంటూ డేట్ ప్రకటించడం ..మళ్లీ వాయిదా పడటం. ఈ నేపథ్యంలో తాజాగా మర్చి 3 న ఉరి శిక్షని ఫిక్స్ చేసారు. కానీ , మరోసారి.. నలుగురు దోషులు ఉరిశిక్షను తప్పించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దోషుల ఉరిశిక్ష అమలు చేయడానికి ఉద్దేశించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి వేర్వేరుగా ఉరిశిక్ష ఉరిశిక్ష అమలు చేసేలా అనుతి ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు సుప్రీంను ఆశ్రయించారు.. ఈ పిటిషన్‌ పై విచారణను మార్చి 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీనితో , ఉరిశిక్ష అమలు మరోసారి నిలిచిపోయే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . కాగా, ఈ కేసులో దోషులుగా ఉన్న పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఢిల్లీ న్యాయస్థానం ఇదివరకే డెత్ వారెంట్‌ను జారీ చేసింది.. దాని ప్రకారం వచ్చేనెల 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఆ నలుగురిని తీహార్ జైలు లో ఉరి తీయాల్సి ఉంది. ఇప్పటికే రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడగా , ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలని పరిశీలిస్తే ... మూడోసారి కూడా వాయిదా పడబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News