కేంద్రప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న జమిలి ఎన్నికలపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు జమిలిని నిరసిస్తుండగా....తాజాగా మిత్రపక్షం - తమతో కలిసి అధికారం పంచుకుంటున్న పార్టీ మోడీ ఎత్తుగడలు అయ్యే పని కాదని తేల్చేశారు. ఇలా బీఏపీ కలవరపాటుకు గురయ్యే కామెంట్ చేసింది ఎవరంటే...బీహార్ సీఎం నితీశ్ కుమార్. బీజేపీతో జేడీయూ పొత్తు తెగిపోతోందా..ఎన్డీయే కూటమిలో కొనసాగుతుందా.. అనే చర్చకు తెరపడి ఎన్డీయేతో భాగస్వామ్యం కొనసాగించాలని జేడీయూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే...నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొన్ని పార్టీలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలతో న్యాయ కమిషన్ రెండు రోజులు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ ఆదివారం ముగిసింది. జమిలి ప్రతిపాదనకు నాలుగు పార్టీలు మద్దతు తెలుపగా తొమ్మిది రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. సంప్రదింపులకు అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ జమిలి నిర్వహణ అసాధ్యమని తెలిపారు. 2019లో కాదు, 2024లోనూ ఆ ఎన్నికల నిర్వహణ వీలుకాదని నితీశ్ అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సైద్ధాంతికంగా జమిలి ఎన్నికలకు అనుకూలమని, కానీ ప్రస్తుతం ఆ ఎన్నికల నిర్వహణకు అలాంటి పరిస్థితులు ఏమీలేవని సీఎం నితీశ్ తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు అనేక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఆ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తే బాగుంటుందని సీఎం నితీశ్ అభిప్రాయపడ్డారు. బీహార్ లో మాత్రం జేడీయూ - బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. కానీ ఇతర రాష్ర్టాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఏమీ చెప్పలేమన్నారు. కాగా, ఈనెల 12 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాట్నాలో నితీష్ సమావేశమై, లోక్ సభ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లనేది ఖరారుకానుంది.