ఇంధన రంగానికి ఓఎన్జీసీ అద్భుత కానుక

Update: 2020-01-06 08:55 GMT
భారత దేశ ఇంధన అవసరాలు తీర్చగల దేశంలోనే అతిపెద్ద చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ (ఏఆర్పి)ను మేఘా సంస్థ అధునాతన పద్ధతిలో పునర్నిర్మించి ఔరా అనిపించింది. తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి న్యూ ఇయర్ కానుకగా అందజేసింది.

అసోం రాష్ట్రంలో ఓఎన్ జేసీకి ప్రతిష్టాత్మకమైన ‘‘ఆన్షోర్ చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ (ఏఆర్పి)’’ ప్రాజెక్టు ఉంది. ఇది దేశంలోనే అతిపెద్దది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా లేకపోవడంతో రూ. 2400 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ పద్ధతిలో పునర్ నిర్మించారు. ఈ పనిని ఈపీసీ పద్ధతిలో దక్కించుకున్న మేఘా సంస్థ (ఎంఇఐఎల్) తాజాగా అసోం రాష్ట్రంలోని లఖ్వా గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)ను పూర్తిచేసి జాతికి అంకింతం చేయడం ద్వారా దేశానికి గొప్ప బహుమతిని అందించింది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మేఘా

అసోంలోని అన్ షోర్ వ్యవస్థలో గతంలో క్లిష్టమైన నిర్మాణాలు, సుదూరమైన పైపులైన్లు ఉండగా వాటి సంఖ్యను, దూరాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రిమోట్ తరహాలో పనిచేయించడం ద్వారా వ్యయా ప్రయాసాలను, భారాలను ఓఎన్జీసీ-ఎంఇఐఎల్ తగ్గించాయి. ఓఎన్జీసీ చేపట్టిన భూ ఉపరితల (ఆన్షోర్) ప్రాజెక్ట్ల్లో దేశంలో ఇదే పెద్దది కావడంతో ఈ ప్రాజెక్ట్ను ఆ సంస్థ ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తోంది. దేశీయ చమురు ఇంధన రంగంలో కీలకభూమికను నిర్వహించే ఈ వ్యవస్థ అధునాతన పద్ధతిలో పునర్నిర్మించడం ద్వారా విదేశీ చమురును దిగుమతిచేసుకునే అవసరాలు కూడా తగ్గముఖం పడతాయి.

దేశానికి కీలకమైన లఖ్వా, లఖ్మిణి కేంద్రాలు

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి ప్రస్తుతం ఉన్న 1.4 ఎంటిపిఏ (మిలియన్ టన్స్ పర్ ఇయర్) అంటే 10.3 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ చేస్తుంది. 2.5 ఎంటిపిఏ అంటే 18.3 మిలియన్ బ్యారెల్స్ చమురు సరఫరా, నిల్వ ప్రాసెసింగ్ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇందులో లఖ్వా, లఖ్మణి కేంద్రాలు చాలా కీలకమైనవి
మూడు దశాబ్ధాల క్రితం అసోంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన చమురు, ఇంధన వాయు నిల్వ, రవాణా వ్యవస్థ పాతబడిపోయింది. ఇంధన ఉత్పత్తి శుద్ధి సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కాలం చెల్లిన నిర్మాణాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ఓఎన్జీసీ అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ను (ఏఆర్పి) చేపట్టింది. ఈ పనులు ప్రారంభించిన ఎంఇఐఎల్ ప్రధానంగా వెల్ ఫ్లూయిడ్ లింక్తో పాటు చమురు, గ్యాస్ సరఫరా అయ్యే పైపులైన్లను, గ్యాస్ లిఫ్ట్ లైన్లు, వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు ఉపయోగపడే వాటర్ ఇంజెక్షన్ లైన్లను నిర్మించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం ద్వారా కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకభూమికను నిర్వహించనుంది. గతంలో ఈ విధమైన అధునాతన పద్ధతి ఉండేది కాదు. ఇందుకు అవసరమైన పైపులు, వివిధ యంత్రల పరికరాలను ఎంఇఐఎల్ సొంతంగా ఉత్పత్తి చేసింది. సంస్థకు చెందిన జీడిమెట్లలోని కర్మాగారం నుంచి వీటిని తయారుచేసి నేరుగా అసొంకు సరఫరాచేసి అక్కడ నిర్మాణంలో ఉపయోగించారు. ఓఎన్జీసీ, ఎంఇఐఎల్ అమలు చేయడం ద్వారా 240 కిలోమీటర్లకుపైగా పైప్లైన్ల నిర్మాణం తగ్గిపోయింది. పాత వ్యవస్థలో ప్రధాన నిర్మాణాలు 21 ఉండగా వాటిని 9 తగ్గించారు. వాటిని అధునాతన పద్ధతిలో సమీకృత కేంద్రాలుగా అభివృద్ధి చేసి నిర్మించడం ద్వారా వ్యవస్థ క్లిష్టతను తగ్గించింది. ఇందులో లఖ్వా, లక్మిణి, మోరాన్ కేంద్రాల్లో ప్రధానమైన 9 నిర్మాణాలను ఎంఇఐఎల్ పూర్తి చేసింది.

ఇలా మేఘా సంస్థ దేశానికి కీలకమైన ఇంధన సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పటివరకూ గల్ఫ్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు శుద్ధిని భారత్ లోనే నిర్మింప చేసి భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడింది. భారత అభివృద్ధి పథంలో మేఘా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఓ కలికితురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News