చేతిలో స్మార్ట్ ఫోన్ ఇవాల్టి రోజుల్లో కామన్. చేతిలో ఫోన్ ఎంత సర్వసాధారణమో.. స్మార్ట్ ఫోన్ కొన్నంతనే వాట్సాప్.. గూగుల్ పే.. ఫోన్ పే.. పేటీఎం లాంటివి వేసుకోవడం చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ తో బ్యాంకు అకౌంట్ ను నిర్వహిస్తుంటారు. ఇలా చేసే వారు ఎవరైనా సరే.. ఒక ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని అస్సలు మరవొద్దు.
ఫోన్ లో వాలెట్ యాప్స్.. బ్యాంకు యాప్ లు ఉంటే ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ గేమ్ లు అడకూడదన్నది మర్చిపోకూడదు. ఒకవేళ.. అలా ఉంచుకొని కూడా గేమ్ లు అడుతున్నారంటే.. ఏదో ఒక రోజు మీ ఖాతా ఖాళీ కావటం ఖాయం. భయపెట్టిస్తున్నట్లుగా మా మాటలు ఉండొచ్చు.
కానీ.. ఇటీవల కాలంలో ఈ తరహా బాధితులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. పిల్లలు గేమ్ ఆడిస్తామని అడిగినంతనే.. పెద్దలు వారి చేతికి తమ స్మార్ట్ ఫోన్ ఇవ్వటం.. ఆ క్రమంలో పిల్లలు గేమ్ ఆడే ఉత్సాహంలో.. ప్రమాదకరమైన లింకుల్ని టచ్ చేసి.. మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుల్ని మాయం అయ్యేందుకు కారణమవుతారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది.
షాబాద్ మండలం సీతారాంపురం పరిధిలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయదలిచారు. ఇందులో భాగంగా పొలం కావాలన్న వేళ.. ఒక వ్యక్తి తన పొలాన్ని అమ్మేశాడు. అతనికి రూ.1.05 కోట్లు వచ్చాయి. మరో ప్రాంతంలో పొలాన్ని కొనుగోలు చేసేందుకు రూ.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. మిగిలిన రూ.80 లక్షల్ని తన చిన్న కుమారుడు పద్దెనిమిదేళ్ల హర్ష బ్యాంకు అకౌంట్లో వేశాడు.
అయితే.. మొబైల్ గేమ్ లు ఆడే అలవాటున్న హర్ష.. ఎప్పటిలానే ఫోన్ లో గేమ్ లు ఆడటం.. ప్రమాదకర లింకుల్ని టచ్ చేయటం చేసేశాడు. అతని అకౌంట్లో ఉన్న రూ.80లక్షలు మాయం అయ్యాయి. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి అబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఎలాగైనా పోయిన డబ్బుల్ని వెనక్కి తీసుకురావాలని వారు ప్రాధేయపడుతున్న తీరు చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అందుకే.. మొబైల్ పోన్ అందునా స్మార్ట్ పోన్ ఉన్న వారు ఎవరైనా సరే.. ఆన్ లైన్ గేములు ఆడితే.. ఈ తరహా మోసం బారిన పడొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.