కరోనా కాలంలో మాస్క్ మన జీవితంలో భాగమైంది. ఓ పూట భోజనం లేకున్నా ఉండొచ్చు కానీ ఒక్కపూట మాస్క్ లేకపోతే ప్రమాదమే. మాస్క్ తో జీవితాన్ని పదిలంగా ఉంచుకోవాలని ఎందరో ఆరోగ్య నిపుణులు సూచించారు. ఎంత ఇబ్బంది కలిగించినా దీనిని ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే ఈ మాస్క్ వల్ల లేనిపోని తంటాలు వచ్చిపడుతున్నాయి.
మాస్క్ ధరించి సన్ బాత్ కి వెళ్లిన ఓ వ్యక్తిని వింత అనుభవం ఎదురైంది. మాస్క్ పెట్టుకొని తన ఇంట్లో ఉన్న తోటలో సన్ బాత్ కి వెళ్లారు ఓ వ్యక్తి. అనంతరం మాస్క్ తీసి అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోయారు. ఆయన ముఖంపై మాస్క్ గుర్తు అలాగే ఉండిపోయింది. ముక్కు, మూతి నుంచి చెవుల వరకు మాస్క్ ముద్ర ఏర్పడింది. ఇది చూసిన ఆ వ్యక్తి నిర్ఘాంతపోయారు.
సన్ బాత్ కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ తీయాలని ఆయన సూచించారు. లేదంటే తనకు జరిగిన పరిస్థితే ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై ఫన్నీ కామెంట్లు రాకపోలేదు. వీడియోను బాస్కెట్ బాల్ ప్రముఖ క్రీడాకారుడు రెక్స్ చాంప్ మ్యాన్ షేర్ చేశారు. అంతేకాకుండా తనకు బాగా నవ్వు తెప్పించిందని పేర్కొన్నారు.
మాస్క్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వల్ల ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి మారిందని అంటున్నారు. మాస్క్ ధరిస్తే ఒక తంటా... ధరించకపోతే ఇంకో బాధ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.