ఈవీఎంల ట్యాంపరింగ్.. ఇప్పటికైనా నిజం తెలిసిందా?

Update: 2019-10-27 14:30 GMT
2014లో చంద్రబాబు గెలిచినప్పుడు క్రెడిట్ అంతా నాదే అన్నాడు. అదే 2019 ఎన్నికల వేళ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని దేశంలోని అన్ని పార్టీల అధినేతలతో కలిసి రచ్చ చేశాడు. సుప్రీం కోర్టులో పిటీషన్ వేసి మోడీ సర్కారుపై నిందలేశాడు. చంద్రబాబే కాదు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ మోడీ రెండోసారి ఏకపక్ష విజయంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. జగన్ అఖండ మెజార్టీని కూడా చంద్రబాబు శంకించాడు.  ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే సాధ్యమని ఆరోపించారు.

అయితే తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఫలితాలు చూసి మాత్రం ఇదే కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఖుషీగా ఉండడం గమనార్హం. బీజేపీకి భారీ నష్టం కలిగించి షాకిచ్చిన ఈ ఫలితాలను చూసి ఇక ఈవీఎం ట్యాంపరింగ్ అని అనడానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సాహసించడం లేదు..

మహారాష్ట్రలో బీజేపీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచింది. ఇక్కడ ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేనలు మెజార్టీ సీట్లు సాధించి సత్తాచాటాయి. బీజేపీ పొత్తుపెట్టుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక హర్యానాలో హంగ్ వచ్చేసింది. బీజేపీకి మెజార్టీ ఇవ్వకుండా ఓటర్లు షాకిచ్చారు. ఐదునెలల్లోనే బీజేపీకి ఏకంగా 9శాతం ఓటు షేరింగ్ తగ్గడం గమనార్హం.

నిజంగా బీజేపీ కనుక  నాడు  లోక్ సభ ఎన్నికల్ ఈసీకి ప్రత్యేకాధికారులు ఉన్న సమయంలో   ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉంటే ఇప్పుడు చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. అయినా మహారాష్ట్ర, హర్యానాలో దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు నిస్తేజంగా ఉన్న స్థితిలో కూడా బీజేపీకి గట్టి పోటీనిచ్చేంది.  మహారాష్ట్రలో అయితే అన్ని పార్టీలు మంచి స్థాయిలో సీట్లు సాధించాయి. హర్యానాలో హంగ్ వచ్చింది. దీన్ని బట్టి ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని.. నిజమైన ఫలితాలే వచ్చాయని ప్రతిపక్షాలు - కాంగ్రెస్ మిన్నకుండిపోయాయి.  ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సహా ప్రతిపక్షాలు ఈ ఈవీఎం ట్యాంపరింగ్ రగడను ఆపేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..
   

Tags:    

Similar News