ప్రజా ప్రతినిధులు ..అంటే తమ పై ఎటువంటి మచ్చలేని వారై ఉండాలి. కానీ , ప్రస్తుత రోజుల్లో రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఆర్థిక బలం , అంగ బలం ఉంటే సరిపోతుంది. ఈ బలం చూసుకొనే ప్రస్తుత పార్టీలు కూడా టికెట్స్ ని కేటాయిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎన్ని ఎక్కువ కేసులు ,ఎంత నేర చరిత్ర ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నటుగా తయారయ్యింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అందులో మరోసారి అప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్ ఈ ఎన్నికలలో 70 కానీ గాను 62 స్థానాలలో గెలవగా - బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది.
అయితే , ఈ ఎన్నికలలో గెలిచిన వారు మూడొంతుల్లో - రెండొంతుల మంది తీవ్రమైన నేర చరిత్ర కలవారే కావడం గమనార్హం. వీరిలో చిన్న చిన్న నేరాలు చేసినవారి నుండి - అత్యాచార యత్నం - హత్యాయత్నం చేసినవారు కూడా ఉండటం విశేషం. వీరిలో 9 మంది దోషులుగా కూడా తేలినట్టు ఏడిఆర్ వెల్లడించింది. మొత్తంగా చూస్తే నామినేషన్స్ సమయంలో 43 మంది అభ్యర్థులు తమ పై నేర చరిత్ర ఉన్నట్లు ప్రకటించుకున్నారు. వారిలో 37 మంది ఎమ్మెల్యేలపై అత్యాచారం - హత్యాయత్నం తదితర తీవ్రమైన నేర చరిత్ర కల కేసులు ఉన్నట్లు తెలిపింది. అయితే ,మరో ముఖ్య విశేషం ఏమిటంటే ..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సంఖ్య కేవలం 24 ..కానీ , ఈ సంఖ్య ఈ ఎన్నికల సమయానికి భారీగా పెరిగింది.
ఇక ఈ ఎన్నికలలో గెలిచి మరోసారి ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న అప్ కూడా ..అదే రేంజ్ లో నేరచరిత్ర కలవారిని అసెంబ్లీ లోకి పంపింది. అప్ నుండి గెలిచిన 62 మంది ఎమ్మెల్యేలలో ..38 మందికి నేరచరిత్ర ఉంది. అంటే ..సగం కంటే ఎక్కువ మంది నేర చరిత్ర కలవారే అప్ తరపున విజయం సాధించడం గమనార్హం. ఇక బీజేపీ నుండి 8 మంది విజయం సాధించగా ..వారిలో ఐదు మందికి నేర చరిత్ర ఉంది. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే ..వచ్చే రోజుల్లో అసెంబ్లీ లో - పార్లమెంట్ లో కేవలం నరచరిత్ర కలవారే ఉంటారేమో ...