అంబులెన్స్ లకు దారివ్వని డ్రైవర్లకు షాక్

Update: 2015-10-09 13:24 GMT
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చక్కటి నిర్ణయం తీసుకున్నారు. రోడ్ సెన్స్ తో పాటు.. రోడ్ల మీద వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత భాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు వీలుగా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రోడ్ల మీద వాహనాలు నడుపుతున్న సమయంలో.. వెనుక వచ్చే అంబులెన్స్ లకు దారి ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధికారిక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అంబులెన్స్ లకు ఎవరైనా వాహనాదారుడు దారి ఇవ్వని పక్షంలో అతని డ్రైవింగ్ లైసెన్స్ లను క్యాన్సిల్ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 1500 అంబులెన్స్ సర్వీసుల్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్ లకు దారి ఇవ్వని డ్రైవర్ల లైసెన్స్ లపై వేటు వేస్తామని.. కర్ణాటక రాష్ట్రంలోని దాదాపు 3లక్షల కిలోమీటర్ల మేర అంబులెన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఆపత్ కాలంలో సంజీవినిలా వ్యవహరించే అంబులెన్స్ ల విషయంలో కర్ణాటక సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News