ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థగా గుర్తింపు పొందిన పుణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రాజెన్కా, ఆక్స్ ఫర్డ్ టీకా మూడో దశ ప్రయోగాలను భారత్ లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ డిసెంబరు నాటికి 100 మిలియన్ డోస్ ల ఉత్పత్తే లక్ష్యంగా 24 గంటలు కష్టపడుతుంది. అలాగే డిసెంబరులోనే దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కూడా చేయనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో తేలితే కనీసం బిలియన్ డోస్ లను ఉత్పత్తి చేయనున్నామని వెల్లడించారు.
అత్యవసర వినియోగం కింద కేంద్రం నుంచి డిసెంబరులో అనుమతి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పూర్తిస్థాయి అనుమతి వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసిన డోస్ లలో దక్షిణాసియా దేశాలకు 50 శాతం, కొవాక్స్ కు 50 శాతం కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఐదు వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలతో డోస్ ల కోసం సీరమ్ ఒప్పందాలు చేసుకుంది. గత రెండు నెలలు నుంచి 40 మిలియన్ల వరకు ఆస్ట్రాజెన్ కా టీకా డోస్ లను ఉత్పత్తి చేసింది. అలాగే, తర్వలోనే నొవావాక్స్ టీకా ఉత్పత్తి ప్రారంభించనుంది. ఫ్రంట్ లైన్ యోధులకు ఈ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. అత్యవసర వినియోగం కింద యూకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత వీలైంత తర్వగా డిసెంబరులో వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉందని ఆస్ట్రాజెన్కా సీఈఓ పాస్కల్ సోరియట్ అన్నారు.
యూకే అనుమతి ఇస్తే.. ఆ నివేదికను భారత ప్రభుత్వానికి అందజేయాలని సీరమ్ భావిస్తోంది.ఇక, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందజేయడానికి రెండేళ్లు పడుతుందని, 2024 నాటికి ఇది పూర్తవుతుందని పునావాలా పునరుద్ఘాటించారు. తొలుత కరోనాపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందజేయాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలిపారు.